Money Changes: New Rules From October For Debit, Credit Card, Nps, Apy Accounts - Sakshi
Sakshi News home page

New Money Rules: అక్టోబ‌ర్ 1 నుంచి రాబోయే మార్పులివే, క్రెడిట్‌ కార్డు యూజర్లకు ఆర్బీఐ అలెర్ట్‌

Published Thu, Sep 29 2022 5:57 PM | Last Updated on Thu, Sep 29 2022 6:23 PM

New Rules From October For Debit, Credit Card, Nps, Apy Accounts - Sakshi

ఆర్బీఐ, స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థలు (సెబీ) క్రెడిట్‌ కార్డ్‌, డీమ్యాట్‌ అకౌంట్‌లపై పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1 నుంచి మార్పులు అమలు కానున్నాయి. వీటితో పాటు టోకనైజేషన్‌, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్ (ఎన్‌పీఎస్‌), అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకాల్లోని మారిన నిబంధనల గురించి తెలుసుకుందాం. 

క్రెడిట్‌ కార్డు
వినియోగదారుల భద్రతే లక్క్ష్యంగా ఆర్బీఐ ఈ ఏడాది జులై నుంచి డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డులపై ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వస‍్తుంది. తాజాగా ఆర్బీఐ క్రెడిట్‌ కార్డుల జారీ అంశంలో కొత్త నిబంధనల్ని తెచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. అక్టోబర్‌ 1 నుంచి క్రెడిట్‌ కార్డుల జారీ సంస్థలు.. లబ్ధి దారులకు కార్డు జారీ చేసే ముందు వారి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా పొందాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత కార్డు బ్లాక్‌ అవుతుంది. అలాగే వినియోగదారుడి అనుమతి లేకుండా క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను పెంచవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 

అటల్‌ పెన్షన్‌ యోజన 
పన్ను చెల్లింపు దారులు అక్టోబర్‌ 1 లోపు అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకంలో చేరే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 లేదా ఆ తర్వాత నుంచి చేరేందుకు అనర్హులని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఒకవేళ అక్టోబర్‌ 1 న ఏపీవైలో చేరితే ఆ ఖాతాను బ్లాక్‌ చేసి, డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. 

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ 
నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఖాతా దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలరేటరీ అండ్‌  డెవలప్మెంట్ అథారటీ ( పీఎఫ్‌ఆర్డీఏ) ఆదేశాల ప్రకారం.. అక్టోబర్‌ 1 నుంచి పెన్షన్‌ స్కీమ్‌ ఖాతాదారులు చేసిన ఈ - నామినేషన్‌ను నోడల్‌ కార్యాలయం అధికారులు 30 రోజుల వ్యవధిలో యాక్సెప్ట్‌ చేయొచ్చు. లేదంటే రిజక్ట్‌ చేయొచ్చు. 30 రోజులు పూర్తయిన అధికారులు స్పందించకపోతే సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ( సీఆర్‌ఏ) సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ- నామినేషన్‌ ఆమోదం పొందుతుంది. 

డీ మ్యాట్‌ అకౌంట్‌
స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయాలంటే డీమ్యాట్‌ అకౌంట్‌ తప్పని సరి. అయితే ఈ డీమ్యాట్‌ అకౌంట్‌పై స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ (సెబీ) ఈ ఏడాది జూన్‌ 14న సర్క్యూలర్‌ను పాస్‌ చేసింది. ఆ సర్క్యూలర్‌ ప్రకారం.. డీ మ్యాట్‌ టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ను సెప్టెంబర్‌ 30,2022లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అకౌంట్‌ను ఓపెన్‌ చేసేందుకు ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు బయో మెట్రిక్‌ అథంటికేషన్‌ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement