హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది.
అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్‌పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు.
ఈ కార్డుపై లైఫ్‌స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్‌లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది.
చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం!
Comments
Please login to add a commentAdd a comment