ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఆర్ధిక రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది యాపిల్ తన స్టోర్‌లను భారత్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశాన్ని సందర్శించిన ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ శశిధర్ జగదీషన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీలో యాపిల్ క్రెడిట్ కార్డ్ విడుదలతో పాటు ఇతర అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం.
తాజాగా,యాపిల్..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)తో సంప్రదింపులు జరిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, టెక్ దిగ్గజం ‘యాపిల్ పే’ పేరుతో క్రెడిట్ కార్డ్‌ను తేనుందని, ఈ కార్డ్ సాయంతో రూపే ప్లాట్ ఫామ్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ చేసుకునేలా చర్చలు జరిపినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.
భారత్‌లోని బ్యాంక్‌లు తన కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే, వినియోగదారులు ట్రాన్సాక్షన్లను మరింత వేగంగా, సులభతరం చేసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి డబ్బుల్ని సెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు యాపిల్‌ఏ తరహా క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేయనుందనే ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ క్రెడిట్ కార్డ్ విడుదలపై టెక్ దిగ్గజం ఆర్‌బీఐని సంప్రదించగా.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్ధిష్ట నిబంధనలను అనుసరించాలని ఆర్‌బీఐ సూచించింది.
చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్
Comments
Please login to add a commentAdd a comment