ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. న్యూమరికల్ నంబర్లతో కూడిన ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను ఎస్‌బీఐ గురవారం ఈసీకి అందించింది. మార్చి 18న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి న్యూమరికల్ నంబర్లతో పూర్తి వివరాలను వెల్లడించాలని ఎల్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే రెండు సార్లు బాండ్ల వివరాలను ఈసీకి పంపిన ఎస్‌బీఐ.. న్యూమరికల్ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తాజాగా ఎస్‌బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించిన బాండ్ల పూర్తి వివరాల్లో.. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతా నంబర్‌లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పూర్తి వివరాలు ఉన్నాయి.
ఇక..‘బ్యాంక్ అకౌంట్ల భద్రత (సైబర్ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. అదేవిధంగా ఎస్‌బీఐ పూర్తి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందించిన అనంతరం ఈసీ తన అధికారిక వెబ్‌సైట్ ఈ వివరాలను పొందుపర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
చదవండి: ‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే
Comments
Please login to add a commentAdd a comment