ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధాలో ఉద్యోగాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో ఐఐటీ, ఐఐఎంలో చదివినవారిని ఎందుకు నియమించుకోలేదని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ తోమర్‌తో జరిపిన సంభాషణలో కామత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జెరోధా కంపెనీలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు ఎందుకు లేరనే ప్రశ్నకు స్పందిస్తూ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను నియమించుకోకూడదనే నిబంధనేమీ సంస్థలో లేదని కామత్ స్పష్టం చేశారు. అయితే కంపెనీలో వారిని నియమించుకుని జీతభత్యాలు చెల్లించేంత డబ్బు లేదని తెలిపారు. చదువు అయిపోయాక వారు భారీ జీతాలు ఆశిస్తారని పేర్కొన్నారు.
చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నట్లు కామత్ చెప్పారు. అయితే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని రానున్న రెండేళ్లు, ఐదేళ్లు.. అలా ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ వెళ్తే విజయం దానంతటదే వస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!
డేట్రేడింగ్ చాలా ప్రమాదకరమని కామత్ అన్నారు. దీర్ఘకాల పెట్టుబడితో మంచి రాబడులు పొందవచ్చని చెప్పారు. కంపెనీలు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్..వంటి మంచి లాభాలు తీసుకొచ్చే ఎన్నోమార్గాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment