'ఆలోచిస్తే ఆశ్చర్యపోతుంటాను': భారత్‌పై నితిన్ కామత్ వ్యాఖ్యలు | Zerodha CEO Nithin Kamath Tweet About India | Sakshi
Sakshi News home page

'ఆలోచిస్తే ఆశ్చర్యపోతుంటాను': భారత్‌పై నితిన్ కామత్ వ్యాఖ్యలు

Published Wed, Nov 27 2024 3:36 PM | Last Updated on Wed, Nov 27 2024 4:05 PM

Zerodha CEO Nithin Kamath Tweet About India

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. జెరోధా సీఈఓ 'నితిన్ కామత్' భారత్ చాలా వైవిధ్యంగా ఉందని అన్నారు. ఇటీవలే ఐరోపాలోని చాలా దేశాలను సందర్శించాను. అక్కడన్నీ చిన్న తేడాతో అంతా కట్, కాపీ.. పేస్ట్ మాదిరిగా అనిపించాయని అన్నారు.

భారతదేశం మాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. మనది ఒక దేశం అయినప్పటికీ.. వైవిధ్యంలో ఓ ఖండం లాంటిదని నితిన్ కామత్ అన్నారు. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో భాష, ఒక్కో ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు.. ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఇన్ని భిన్నమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశం మొత్తం ఏకతాటిపై ఉంది. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతుంటానని కామత్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఎన్ని భాషలు, ఆచార & సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ ఏకీకృతం చేయగలిగిన సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందని కామత్ దేశాన్ని కీర్తించారు. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ.. ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది అంటే.. దానికి కారణం ఈ ఏకీకృతమే అని ఒకరు అన్నారు.

భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నా.. ఎన్నెన్ని దేశాలు ఇండియాను ఆదర్శంగా తీసుకుంటున్నా.. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ప్రగతి కుంటుపడుతోంది. వీరు కూడా సవ్యంగా నడుచుకుంటే.. ప్రపంచానికి మన దేశం మకుటాయమానంగా నిలుస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement