జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ ఇటీవల వెలుగులోకి వస్తోన్న కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ స్కామ్‌తో మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు మోసం జరుగుతున్న విధానాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అటువంటి స్కామర్లు బారిన పడకుండా ఉండాలంటే ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను అందించారు.
మోసం చేస్తున్నారిలా..
‘అత్యవసరంగా కాల్ చేయాలి.. మీ ఫోన్‌ను వినియోగించవచ్చా.. అనేలా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని అడగవచ్చు. అమాయకంగా కనిపించే వ్యక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలు.. ఈ స్కామర్ల టార్కెట్ కావొచ్చు. వారు మీ ఫోన్ తీసుకుని కాల్ చేయడానికి రహస్యంగా పక్కకు వెళితే మాత్రం అనుమానించాలి. ఎందుకంటే స్కామర్ రహస్యంగా తనకు అవరసరమయ్యే యాప్‌లను మీకు తెలియకుండానే డౌన్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పటికే ఉన్న యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ అలర్ట్‌లతో సహా కాల్స్, మెసేజ్‌లను వారి నంబర్లకు ఫార్వర్డ్ చేయడానికి మీ ఫోన్‌లో సెట్టింగ్లను మార్చవచ్చు. దీని ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను(ఓటీపీలు) అడ్డుకుని అనధికార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు’ అని కామత్ అన్నారు.
Imagine this: A stranger approaches you and asks to use your phone to make an emergency call. Most well-meaning people would probably hand over their phone. But this is a new scam.
From intercepting your OTPs to draining your bank accounts, scammers can cause serious damage… pic.twitter.com/3OdLdmDWe5— Nithin Kamath (@Nithin0dha) January 15, 2025
ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?
ఏం చేయాలంటే..
‘మీ ఫోన్ ను అపరిచితులకు అప్పగించవద్దు. అందుకు బదులుగా ఆ నంబర్‌ను మీరే డయల్ చేసి స్పీకర్ ఆన్‌లో పెట్టి మాట్లాడాలని సూచించాలి. ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించే అవకాశం ఉంది’ అన్నారు. కామత్ షేర్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో 4,50,000 మందికి పైగా వీక్షించారు. చాలా మంది వినియోగదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలకు సంబంధించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు. విభిన్న భాషల్లో ఉన్న జెరోధా వినియోగదారులు, తన ఫాలోవర్ల కోసం ఇలాంటి అవగాహన వీడియోను ఇతర భాషల్లోకి అనువదించాలని కొందరు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment