Trading accounts
-
ట్రేడింగ్‌లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్‌లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్‌ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్‌మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్‌ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్‌వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్‌సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్‌కు ఉద్యోగాలివ్వని జెరోధా.. కారణం చెప్పిన కామత్
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధాలో ఉద్యోగాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో ఐఐటీ, ఐఐఎంలో చదివినవారిని ఎందుకు నియమించుకోలేదని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ తోమర్‌తో జరిపిన సంభాషణలో కామత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. జెరోధా కంపెనీలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు ఎందుకు లేరనే ప్రశ్నకు స్పందిస్తూ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను నియమించుకోకూడదనే నిబంధనేమీ సంస్థలో లేదని కామత్ స్పష్టం చేశారు. అయితే కంపెనీలో వారిని నియమించుకుని జీతభత్యాలు చెల్లించేంత డబ్బు లేదని తెలిపారు. చదువు అయిపోయాక వారు భారీ జీతాలు ఆశిస్తారని పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నట్లు కామత్ చెప్పారు. అయితే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని రానున్న రెండేళ్లు, ఐదేళ్లు.. అలా ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ వెళ్తే విజయం దానంతటదే వస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..! డేట్రేడింగ్ చాలా ప్రమాదకరమని కామత్ అన్నారు. దీర్ఘకాల పెట్టుబడితో మంచి రాబడులు పొందవచ్చని చెప్పారు. కంపెనీలు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్..వంటి మంచి లాభాలు తీసుకొచ్చే ఎన్నోమార్గాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
ఇసాఫ్ బ్యాంక్ కస్టమర్లకు జియోజిత్ ట్రేడింగ్ అకౌంట్
కోచి: జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు 3 ఇన్ 1 డీమ్యాట్ బండిల్డ్ అకౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. ఇదీ చదవండి: ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్ దీని కింద ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులు జియోజిత్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌ను ఉచితంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లో కేవలం 15 నిమిషాల్లో ఖాతా తెరవొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ తెలిపింది. 3 ఇన్ 1 ఖాతా కింద.. డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు ఎలాంటి చార్జీలు ఉండవని, సౌకర్యమైన బ్రోకరేజీ ప్లాన్లు పొందొచ్చని ప్రకటించింది. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! -
కేవైసీ లేకుంటే ఆటోమేటిక్‌గా ట్రేడింగ్ ఖాతాల డీయాక్టివేషన్
న్యూఢిల్లీ: నో యువర్ క్లయింట్ (కేవైసీ) వివరాలు సమగ్రంగా లేకపోతే ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేసే నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఇవి ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తాయని ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కేవైసీ ప్రక్రియలో చిరునామాలు అత్యంత కీలకమని సెబీ స్పష్టం చేసింది. సాధారణంగా ఇన్వెస్టర్ల చిరునామాలను మధ్యవర్తిత్వ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. వీటి ప్రకారం సెబీ జారీ చేసే ఆదేశాలు మొదలైన వాటిని ఏ ఎంఐఐ (మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ) కూడా ఇన్వెస్టర్‌కి అందజేసి, రసీదు తీసుకోలేకపోయిన పక్షంలో .. డెలివరీ విఫలమైన తేదీ నుంచి అయిదు రోజుల్లో అన్ని ఎంఐఐలు సదరు మదుపుదారు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం ఒకే ఎంఐఐ విఫలమైతే మాత్రం ఖాతాల డీయాక్టివేషన్ ఉండదని సెబీ తెలిపింది. అలాగే, తగిన పత్రాలన్నింటితో దర ఖాస్తు చేసుకుంటే ఎంఐఐలు అయిదు రోజుల్లోగా రీయాక్టివేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
అదృష్టంలో దురదృష్టం అంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు?
అదృష్టంలో దురదృష్టం అంటే ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సంఘటన ఉదాహరణ. చైనాలో ఒక వ్యక్తి ట్రెండింగ్ ఖాతాలో అనుకోకుండా క్రిస్మస్ రోజున 15.6 మిలియన్ డాలర్లు(సుమారు రూ.116 కోట్లు) జమ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ అదృష్టం అంత అతని పేరు చివరన లాంగ్ అని ఉండటం వల్లే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలో ఉన్న నైరుతి ప్రావిన్స్ గుయిజౌలో లాంగ్ నివసిస్తాడు. తనకు స్టాక్ మార్కెట్ ట్రెండింగ్‌లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉంది. అప్పటి వరకు తనకు నష్టాలు రావడంతో ఆ తర్వాత అతను ట్రేడింగ్ యాప్ చాంగ్ జియాంగ్ సెక్యూరిటీస్ ఈ-స్టాక్ ద్వారా సుమారు 940 డాలర్లు మాత్రమే పెట్టుబడి పెట్టినట్లు చెప్పాడు. తన ట్రెండింగ్ ఖాతాలో ఒక్కసారిగా డబ్బు ఎక్కువ మొత్తంలో జమ కావడం చూసి ఆ ఉత్సాహంలో అందరితో ఈ విషయాన్ని పంచుకున్నాడు. కానీ, అతని ఖాతాలో 15.6 మిలియన్ డాలర్లు ఒక రోజు మాత్రమే ఉన్నాయి. తన ఖాతాలో అంత మొత్తం డబ్బు జమ అయిన ఒకరోజు తర్వాత లాంగ్ ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్(940 డాలర్లతో సహ) తుడిచిపెట్టుకుపోయింది. ఇదంతా చాంగ్ జియాంగ్ సెక్యూరిటీస్ సాఫ్ట్ వేర్ లోపం వల్ల డబ్బులు జమ అయినట్లు కస్టమర్ కేర్ అతనికి తెలిపింది. అతను పెట్టుబడిగా పెట్టిన నగదును రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంఘటన గురుంచి తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటున్నారు. (చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!) -
ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-ఇన్-1 ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారి ప్రయోజనం చేకూరుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో మూడు రకాల సదుపాయాలను పొందుతారు. ఈ విషయన్ని ఎస్బీఐ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మీరు ఎస్బీఐ 3-ఇన్-1 తెరవాలనుకుంటే ఈ క్రింది పేర్కొన్న పత్రాలు అవసరం. ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కోసం: పాన్ కార్డు లేదా ఫారం 60 ఫోటోగ్రాఫ్ పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ జారీ చేసే జాబ్ కార్డ్, మీ పేరు & చిరునామా వివరాలతో జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసే ఏదైనా ఒక లేఖ. ఇందులో ఏదైనా ఒక పత్రం అవసరం. ఎస్బీఐ డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ కోసం: పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ పాన్ కార్డ్ కాపీ ఆధార్ కార్డు కాపీ ఒక క్యాన్సిల్ చేయబడ్డ చెక్ లీఫ్/తాజా బ్యాంక్ స్టేట్ మెంట్ Experience the power of 3-in-1! An account that combines Savings Account, Demat Account, and Trading Account to provide you with a simple and paperless trading experience. To know more, visit -https://t.co/Mvt7i2K3Le#Go3in1WithSBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/3RDWUZEgIF — State Bank of India (@TheOfficialSBI) December 15, 2021 -
కేవైసీ పెండింగ్‌లో ఉంటే.. డీమ్యాట్ ఖాతా కట్..
జులై 31 లోగా తమ KYC డిటెయిల్స్ పూర్తి చేయని డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు నిలిపేస్తామంటూ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లు సర్క్యులర్ జారీ చేశాయి. ఈ ఖాతాలు నిలిపేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కేవైసీకి సంబంధించి పేరు,అడ్రస్, పాన్‌కార్డు వివరాలు, ఉపయోగంలో ఉన్న ఫోను నంబరు, ఈ మెయిల్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో లింకైన పాన్‌కార్డునే కేవైసీ గుర్తిస్తుంది. కాబట్టి పాన్‌కార్డును ముందుగా ఆధార్‌లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వడం ఉత్తమం. వ్యక్తిగత వివరాలతో పాటు వార్షిక సంపాదన అంశాలను కేవైసీలో పొందు పరచాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఐదు కేటగిరీలు, వ్యక్తిగతేతర ఆదాయానికి సంబంధించి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. వీటిని అనుసరించి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్లు .. తమ ఆదాయ వివరాల ఆధారంగా తగు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. -
డీమాట్ ఖాతాదారులకు ముఖ్య గమనిక..!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు కచ్చితంగా డీమాట్ ఖాతాను కలిగి ఉండాలి. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ డీమాట్ ఖాతాలను ఓపెన్ చేయడానికి కొత్త నియమాలను తీసుకువచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. డీమాట్ ఖాతా కోసం సెబీ కొత్త నియమాలు సెబీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అక్టోబర్ 1 నుంచి కొత్త ట్రేడింగ్, డీమాట్ ఖాతాలను తెరిచే పెట్టుబడిదారులు నామినేషన్ ఇవ్వడానికి లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి ఎంపిక ఉంటుంది. తాజాగా సెబీ నామినేషన్ ఫారం ఫార్మట్‌ను విడుదల చేసింది. డీమాట్, ట్రేడింగ్ ఖాతా తెరిచేటప్పుడు పెట్టుబడిదారుడు నామినేషన్ చేయడానికి ఇష్టపడకపోతే ఇన్వెస్టర్ ఈ సమాచారాన్ని సెబీకి అందజేయాలి. మీ డీమాట్ ఖాతా స్తంభింపజేస్తారు..! మీ డీమాట్ ఖాతా స్తంభింపకుండా ఉండాలంటే ఇన్వెస్టర్ కచ్చితంగా 'డిక్లరేషన్ ఫారం' నింపాలి. మీకు డీమాట్ ఖాతా ఉంటే, మీరు మార్చి 31, 2022 లోపు నామినేషన్ ఫారమ్‌ను కూడా సమర్పించాలి. నామినేషన్ వద్దనుకుంటే అందుకు వేరే ఫారంను నింపాలి. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న అన్ని అర్హత కలిగిన ట్రేడింగ్, డీమాట్ ఖాతాదారులు 2022 మార్చి 31 నాటికి నామినేషన్ ఎంపికను అందించాల్సి ఉంటుంది. ఇది విఫలమైతే ఆయా ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమాట్ ఖాతాలను సెబీ స్తంభింపజేస్తుంది. నామినేషన్, డిక్లరేషన్ ఫారాలకు సాక్షులు అవసరం లేదు. నామినీకి సంబంధించిన నియమాలు కొత్త నిబంధనల ప్రకారం, డీమాట్, ట్రేడింగ్ ఖాతాదారులు చనిపోతే వారి ఖాతా వాటాలు ఎవరికి బదిలీ చేయాలో తెలియజేయవచ్చును. ఈ నామినేషన్ డీమాట్ ఖాతా తెరిచే సమయంలో మాత్రమే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా నామినీ పేరు మార్చాలనుకుంటే, మార్చవచ్చును. మీరు ఎన్ఆర్ఐను కూడా నామినీగా చేసుకోవచ్చు. కానీ డీమాట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను మాత్రమే నామినీలుగా చేయవచ్చును. ఇద్దరు కంటే ఎక్కువ నామీనీలు ఉంటే ముందుగానే వారి వాటాలను పెట్టుబడిదారుడు నిర్ణయించాల్సి ఉంటుంది. -
డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా?
నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాల తరహాలోనే షేర్ల క్రయవిక్రయాల కోసం ఉపయోగపడేదే డీమ్యాట్ అకౌంటు. డీమెటీరియలైజ్డ్ అకౌంటుకు సంక్షిప్త రూపమే డీమ్యాట్ ఖాతా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ మొదలైన బ్రోకరేజి సంస్థలు డీమ్యాట్ అకౌంట్లు ఇస్తున్నాయి. మార్కెట్లలో పెట్టుబడులకు కీలకమైన డీమ్యాట్ అకౌంట్లు, వాటి తీరుతెన్నుల గురించి వివరించేదే ఈ కథనం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ప్రధానంగా బ్యాంకు అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, డీమ్యాట్ అకౌంటు అవసరమవుతాయి. షేర్లు కొనడం, అమ్మడం నగదుతో ముడిపడి ఉంటుంది కాబట్టి బ్యాంకు ఖాతా కావాలి. ఆన్లైన్లో షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా ఉపయోగపడుతుంది. ఇక మీరు కొన్న షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చేందుకు డీమ్యాట్ ఖాతా అవసరమవుతుంది. సాధారణంగా బ్యాంకింగ్, బ్రోకింగ్ సేవలు అందించే సంస్థలు.. ఈ మూడింటిని 3-ఇన్-1 అకౌంట్లుగా కూడా అందిస్తున్నాయి. తద్వారా ఈ మూడింటిని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవచ్చు. ఇలా కాకుండా కొన్ని కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు విడిగా బ్యాంకు అకౌంటు తీసుకుని, దాన్ని వీటికి అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఇక, డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి కచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. చార్జీలు, ఫీజులు: షేరు కొన్నా, అమ్మినా ప్రతిసారీ బ్రోకరేజి చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అమౌంటుగా గానీ లేదా లావాదేవీ విలువలో ఇంత శాతమని గానీ ఉంటుంది. ఉదాహరణకు బ్రోకింగ్ ఫీజు 0.5 శాతం అనుకుంటే, మీరు రూ. 100 విలువ చేసే స్టాక్స్ కొన్న ప్రతిసారీ 50 పైసలు కట్టాల్సి ఉంటుంది. షేర్లు కాకుండా డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటికి వేరే తరహా చార్జీలు ఉంటాయి. ఇక బ్రోకరేజి సంస్థలు, సర్వీసులను బట్టి వార్షికంగా రూ. 500 నుంచి రూ. 2,000 దాకా ఫీజులు ఉంటాయి. ఇవే కాకుండా డీమ్యాట్ చార్జీలని (షేర్లు పేపర్ సర్టిఫికెట్ రూపంలో ఉంటే వాటిని డీమ్యాట్ రూపంలోకి మార్చేందుకు), అడ్వైజరీ ఫీజులు, ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఫీజులని సర్వీసుల వినియోగాన్ని బట్టి ఉంటాయి. టెక్నాలజీ, ట్రేడింగ్ ప్లాట్‌ఫాం: డీమ్యాట్ ఖాతాను తీసుకోవడంలో తక్కువ బ్రోకరేజి చార్జీలు మాత్రమే చూసుకుంటే సరిపోదు. సిసలైన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫాం టెక్నాలజీ కూడా అత్యాధునికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవే కాకుండా ట్రేడింగ్ ప్లాట్‌ఫాంకి ఉండాల్సిన లక్షణాలివి.. ►క్షణక్షణానికి మారిపోయే షేర్ల రేట్లను రియల్ టైమ్‌లో చూపించాలి ►ఫేవరెట్ స్టాక్స్, ఈవెంట్స్ మొదలైన వాటితో సొంత వాచ్ లిస్ట్ ఏర్పర్చుకునే సదుపాయం ఉండాలి. ►ఫైనాన్షియల్ డేటా, హిస్టరీ, కీలక ఈవెంట్స్, ఆయా కంపెనీల విశ్లేషణ మొదలైనవి అందుబాటులో ఉండాలి. ►నిర్దిష్ట కాలంలో జరిపిన లావాదేవీల హిస్టరీ, పోర్ట్‌ఫోలియో విలువ, లాభనష్టాలు, మార్జిన్ మనీ (అవసరమైతే) మొదలైన వివరాలు తెలిసేలా ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఉండాలి. గుర్తుంచుకోండి... సులభతరంగా లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యంతో పాటు చౌకగా సర్వీసులు అందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకోవాలి. ఇందుకోసం వివిధ బ్రోకింగ్ సంస్థల వెబ్సైట్లలో డీమ్యాట్ ఖాతాల ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి. ఖాతా స్వరూపం, ఇతర వివరాలు, లావాదేవీలు జరిగే విధానం మొదలైనవన్నీ వీటిలో ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాతానో లేదా శాలరీ అకౌంటో కాకుండా కేవలం ట్రేడింగ్ కోసమే ప్రత్యేక బ్యాంక్ అకౌంటు ప్రారంభిస్తే మంచిది. దీనివల్ల మీ లాభనష్టాలు సులభంగా లెక్కకట్టుకోవచ్చు. ఇక, నిమిష నిమిషానికి మారిపోయే స్టాక్‌మార్కెట్ పరిణామాలు చూసి కంగారుపడిపోకుండా ఆలోచించి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడేవిగా ఉండే కొన్ని కంపెనీలనే ఎంచుకోండి. వాటిని పూర్తిగా అధ్యయనం చేయండి. ఇన్వెస్ట్ చేశాక ఓర్పుగా ఉండండి. అప్పుడే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. -
ట్రేడింగ్ ఖాతాల ప్రారంభం సులభ తరం
ముంబై: వ్యక్తిగత ఇన్వెస్టర్లు సులభంగా కొత్త ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించే వీలు కల్పిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకోసం సరళ్ పేరిట అకౌంటు ఓపెనింగ్ ఫారమ్‌ను ప్రవేశపెట్టింది. సాధారణంగా చాలా మటుకు కొత్త ఇన్వెస్టర్లు.. ఇంటర్నెట్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్ వంటి సదుపాయాలు తీసుకోకుండా ప్రధానంగా క్యాష్ సెగ్మెంట్తోనే మార్కెట్లోకి అడుగుపెడతారని సెబీ పేర్కొంది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకే కొత్త ఫారమ్‌ను ప్రవేశపెట్టినట్లు, చిరునామా ధృవీకరణ పత్రాల నిబంధనలను కూడా సడలించినట్లు తెలిపింది.