అదృష్టంలో దురదృష్టం అంటే ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సంఘటన ఉదాహరణ. చైనాలో ఒక వ్యక్తి ట్రెండింగ్ ఖాతాలో అనుకోకుండా క్రిస్మస్ రోజున 15.6 మిలియన్ డాలర్లు(సుమారు రూ.116 కోట్లు) జమ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ అదృష్టం అంత అతని పేరు చివరన లాంగ్ అని ఉండటం వల్లే జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలో ఉన్న నైరుతి ప్రావిన్స్ గుయిజౌలో లాంగ్ నివసిస్తాడు. తనకు స్టాక్ మార్కెట్ ట్రెండింగ్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉంది. అప్పటి వరకు తనకు నష్టాలు రావడంతో ఆ తర్వాత అతను ట్రేడింగ్ యాప్ చాంగ్ జియాంగ్ సెక్యూరిటీస్ ఈ-స్టాక్ ద్వారా సుమారు 940 డాలర్లు మాత్రమే పెట్టుబడి పెట్టినట్లు చెప్పాడు. తన ట్రెండింగ్ ఖాతాలో ఒక్కసారిగా డబ్బు ఎక్కువ మొత్తంలో జమ కావడం చూసి ఆ ఉత్సాహంలో అందరితో ఈ విషయాన్ని పంచుకున్నాడు. కానీ, అతని ఖాతాలో 15.6 మిలియన్ డాలర్లు ఒక రోజు మాత్రమే ఉన్నాయి. తన ఖాతాలో అంత మొత్తం డబ్బు జమ అయిన ఒకరోజు తర్వాత లాంగ్ ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్(940 డాలర్లతో సహ) తుడిచిపెట్టుకుపోయింది. ఇదంతా చాంగ్ జియాంగ్ సెక్యూరిటీస్ సాఫ్ట్ వేర్ లోపం వల్ల డబ్బులు జమ అయినట్లు కస్టమర్ కేర్ అతనికి తెలిపింది. అతను పెట్టుబడిగా పెట్టిన నగదును రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంఘటన గురుంచి తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటున్నారు.
(చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!)
Comments
Please login to add a commentAdd a comment