కేవైసీ పెండింగ్‌లో ఉంటే.. డీమ్యాట్‌ ఖాతా కట్‌.. | Sakshi
Sakshi News home page

కేవైసీ పెండింగ్‌లో ఉంటే.. డీమ్యాట్‌ ఖాతా కట్‌..

Published Sat, Jul 31 2021 12:01 PM

Demat And Trading Accounts With Pending KYC To Be Deactivated - Sakshi

జులై 31 లోగా తమ KYC డిటెయిల్స్‌ పూర్తి చేయని డీమ్యాట్‌, ట్రేడింగ్‌ అకౌంట్లు నిలిపేస్తామంటూ సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌లు సర్క్యులర్‌ జారీ చేశాయి. ఈ ఖాతాలు నిలిపేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

కేవైసీకి సంబంధించి పేరు,అడ్రస్‌, పాన్‌కార్డు వివరాలు, ఉపయోగంలో ఉన్న ఫోను నంబరు, ఈ మెయిల్‌ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డులో లింకైన పాన్‌కార్డునే కేవైసీ గుర్తిస్తుంది. కాబట్టి పాన్‌కార్డును ముందుగా ఆధార్‌లో లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింకైన మొబైల్‌ నంబర్‌ వివరాలు ఇవ్వడం ఉత్తమం.

వ్యక్తిగత వివరాలతో పాటు వార్షిక సంపాదన అంశాలను కేవైసీలో పొందు పరచాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఐదు కేటగిరీలు, వ్యక్తిగతేతర ఆదాయానికి సంబంధించి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. వీటిని అనుసరించి  డీమ్యాట్‌, ట్రేడింగ్‌ అకౌంట్‌ హోల్డర్లు .. తమ ఆదాయ వివరాల ఆధారంగా తగు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement