ముంబై: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్) ప్లాట్‌ఫామ్‌పై యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని సంస్థ గురువారం ప్రకటించింది. యాక్టివ్ (కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి) డీమ్యాట్ ఖాతాల విషయలో ఆసియాలోనూ, దేశీయంగా అతిపెద్ద డిపాజిటరీగా సీడీఎస్‌ఎల్ ఉంది. నియంత్రణ సంస్థ మార్గదర్శకం, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్, మార్కెట్ ఇంటర్‌మీడియరీల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని సీడీఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ నేహల్ వోరా పేర్కొన్నారు.
సీడీఎస్‌ఎల్ 1999 ఫిబ్రవరిలో కార్యకలాపాలు ఆరంభించింది. సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించుకునే సేవలు అందిస్తుంటుంది. సీడీఎస్‌ఎల్ సబ్సిడరీ అయిన సీడీఎస్‌ఎల్ వెంచర్స్ దేశంలో మొదటి అతిపెద్ద కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీగా ఉంది. 4.5 కోట్ల కేవైసీ రికార్డులను కలిగి ఉంది. సీడీఎస్‌ఎల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కమోడిటీ రిపాజిటరీ సేవల్లోనూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment