
కోచి: జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు 3 ఇన్ 1 డీమ్యాట్ బండిల్డ్ అకౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది.
ఇదీ చదవండి: ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్
దీని కింద ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులు జియోజిత్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌ను ఉచితంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కేవలం 15 నిమిషాల్లో ఖాతా తెరవొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ తెలిపింది. 3 ఇన్ 1 ఖాతా కింద.. డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు ఎలాంటి చార్జీలు ఉండవని, సౌకర్యమైన బ్రోకరేజీ ప్లాన్లు పొందొచ్చని ప్రకటించింది.
ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment