యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్ అకౌంట్లపై అందించే వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకారం.. రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని రూ.5లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తున్నట్లు వెల్లడించింది.
యూనిటీ బ్యాంక్ రూ. 1 లక్ష వరకు డిపాజిట్‌లపై సంవత్సరానికి 6.00 శాతం, రూ. 1 లక్ష కంటే ఎక్కువ రూ. 5 లక్షల వరకు ఉన్న నిల్వలకు సంవత్సరానికి 7.00శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలను ఉంచే హెచ్‌ఎన్‌ఐలకు 7.75శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రతి స్లాబ్‌పై నెలవారీ వడ్డీని అందిస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య వడ్డీ రేట్లను 4.50శాతం నుండి 9శాతం వరకు అందిస్తున్నట్లు తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 9.50శాతం, సాధారణ పెట్టుబడిదారులకు 1001 రోజులకు 9.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment