saving accounts
-
సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్ అకౌంట్లపై అందించే వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకారం.. రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని రూ.5లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తున్నట్లు వెల్లడించింది. యూనిటీ బ్యాంక్ రూ. 1 లక్ష వరకు డిపాజిట్లపై సంవత్సరానికి 6.00 శాతం, రూ. 1 లక్ష కంటే ఎక్కువ రూ. 5 లక్షల వరకు ఉన్న నిల్వలకు సంవత్సరానికి 7.00శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలను ఉంచే హెచ్ఎన్ఐలకు 7.75శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రతి స్లాబ్‌పై నెలవారీ వడ్డీని అందిస్తుంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య వడ్డీ రేట్లను 4.50శాతం నుండి 9శాతం వరకు అందిస్తున్నట్లు తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై, యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 9.50శాతం, సాధారణ పెట్టుబడిదారులకు 1001 రోజులకు 9.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. -
విద్యార్థుల కోసం స్పెషల్ అకౌంట్ - ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్: విద్యార్థుల కోసం సున్నా బ్యాలన్స్ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రారంభించింది. 16–25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బీవోబీ బ్రో సేవింగ్స్ ఖాతా’ను రూపొందించినట్టు తెలిపింది. జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయోజనాలు.. 16–25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా సున్నా బ్యాలన్స్తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రపే ప్లాటినం డెబిట్ కార్డ్ సొంతం చేసుకోవచ్చు. ప్రతి త్రైవసికానికీ విమానాశ్రయాల్లో రెండు సార్లు లాంజ్ ప్రవేశాలను పొందొచ్చు. ర.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, ఆర్ట్జీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు ఉచితం. చెక్‌లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్‌ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతా ఏఎంసీపై నూరు శాతం రాయితీ ఉంది. విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీ లేకపోగా, వడ్డీ రేటులో 0.15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు చేరువ చేసేందుకు గాను ఐఐటీ బోంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నియమించుకుంది. -
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!
ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే తరచుగా ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ కాకుండా.. నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాలను వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ క్లోస్ చేసుకోవడానికంటే ముందు తప్పకుండా కొన్ని పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ►బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకునే వ్యక్తి ముందుగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా అందులో ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే దానిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన రెండు నుంచి మూడు నెలల స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ►ఒక వేళా మీరు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు. కావున నెగిటీవ్ బ్యాలెన్స్ లేకుండా ముందుగానే చూసుకోవాలి. బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చార్జీలు సరైన సమయంలో చెల్లించని ఎడల బ్యాంక్ బ్యాలన్స్ మైనస్‌లోకి వెళుతుంది. కావున అకౌంట్లో మినిమమ్ బ్యాలన్స్ ఉన్నప్పుడే బ్యాంక్ అకౌంట్ క్లోస్ చేయడానికి వీలుపడుతుంది. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ►గతంలో మీరు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎమ్ఐ, ఇతర సబ్స్క్రిప్షన్లు చెల్లించడానికి ఆటోమాటిక్ క్లియరెన్స్ ఇచ్చి ఉంటే అలాంటివి క్యాన్సిల్ చేసుకోవాలి. ఆలా చేయకపోతే మీరు సమయానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేరు, ఆ తరువాత అదనపు అమౌంట్ వంటివి చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రస్తుతం చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపే క్లోజ్ చేస్తే క్లోజర్ చార్జీలు విధిస్తుంది. కావున అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కనీస సంవత్సరం పూర్తయితే అప్పుడు బ్యాంకు అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ►ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇన్‌కమ్‌టాక్స్ డీటైల్స్ మీ సేవింగ్స్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటే పిఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసుకునేటప్పుడు, ఇన్‌కమ్‌టాక్స్ నుంచి రీఫండ్ వంటివి వస్తే కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు వేరే అకౌంట్ లింక్ చేసిన తరువాత పాత అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎట్టిపరిస్థితుల్లో మరచిపోకూడదు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
తన ఖాతాదారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. ఖాతాదారుడి ఖాతాలో నిర్వహించే రోజువారీ బ్యాలెన్స్ మీద వడ్డీ లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఈ వడ్డీలను త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచిన కొత్త వడ్డీలు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 3 శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఖాతాలో రూ. 50 లక్షల నుంచి రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మీద బ్యాంక్ 3.50 శాతం వడ్డీని ఇస్తుంది. అదే సమయంలో, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మొత్తం మీద వడ్డీ రేటు 4.50 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సవరించిన రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ పొదుపు ఖాతాలకు వర్తిస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై విధించే వడ్డీరేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోవైపు ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ, ఎన్ఆర్ఐ పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతకు ముందు, రూ.10 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ గల ఖాతాలకు 2.80 శాతం వడ్డీరేటును ఇస్తే, ఈప్పుడు అది 2.75 శాతానికి తగ్గింది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్‌ల మీద ఇచ్చే వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఫండ్ రూ.500 కోట్లు కంటే ఎక్కువ ఖాతా బ్యాలెన్స్‌పై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి పంజాబ్ & సిండ్ బ్యాంక్ పంజాబ్ & సిండ్ బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుంచి పొదుపు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రభుత్వ రంగ రుణదాత ఇప్పుడు రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా నిల్వలపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.20 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, అలాగే ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వర్తిస్తాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!) -
పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై చెల్లించే ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీపీబీ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.25% వడ్డీ రేటు లభిస్తుంది. లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభించనుంది. గతంలో రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభిస్తే, లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.75% వడ్డీ రేటు లభించేది. రోజు వారి బ్యాలన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈఓడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత నెలలో 5 కోట్ల మంది కస్టమర్లకు చేరుకొని సరికొత్త మైలురాయిని అధిగమించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. (చదవండి: ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. అదుర్స్!) -
ఐపీపీబి ద్వారా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవండి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పటికపుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గతంలో కేవలం ఉత్తరాల పంపిణీకి మాత్రమే పరిమితమైన పోస్ట్ ఆఫీస్ కొత్తగా బ్యాంకింగ్ సేవలను తీసుకొచ్చినప్పటి నుంచి తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇండియన్ పోస్టల్ బ్యాంకు మరో కొత్త సాంకేతికతను కొత్త యూజర్లకు అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) తన మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ పొదుపు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని కొత్త యూజర్లకు అందిస్తుంది. గతంలో పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండానే ఐపీపీబి యాప్ ద్వారానే ఇంట్లో నుంచే ఖాతా తెరవవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్, డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఐపీపీబిలో పోస్టాఫీస్ ఖాతా తెరిచే విధానం: 1) దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు అయి ఉండాలి. 2) మీ మొబైల్ ఫోన్లోని ఐపిపిబి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కు వెళ్లి 'ఓపెన్ అకౌంట్' పై క్లిక్ చేయండి. 3) ఇప్పుడు మీ పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. 4) ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. 5) విద్యా అర్హతలు, చిరునామా, నామినీ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలు సమర్పించాలి. 6) అన్ని వివరాలు సమర్పించిన తర్వాత డిజిటల్ ఖాతా తెరవబడుతుంది. ఈ డిజిటల్ పొదుపు ఖాతా ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరంలో మీరు దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మార్చబడుతుంది. చదవండి: 10కోట్లకు పైగా అమ్ముడైన ఆపిల్ వాచ్‌లు ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు -
ఈ బ్యాంకుల్లో ఇంతే...
న్యూఢిల్లీః సగటు మదుపరిపై భారతీయ బ్యాంకులు పంజా విసురుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను కోత పెడుతున్నాయి. నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఉండటం, ద్రవ్యోల్బణం దిగి రావడంతో వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించేస్తున్నాయి. దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును నాలుగు శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించడంతో ఇతర బ్యాంకులూ అదే బాట పట్టాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్ కలిగిన పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 4 నుంచి 3.5 శాతానికి తగ్గించింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో కోతలు విధించింది. ఇండియన్ బ్యాంక్, కర్నాటక బ్యాంక్‌లూ పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. మరో వైపు పొదుపు ఖాతాలపై ఆరు శాతం వడ్డీ రేటుతో మదుపరులను ఆకర్షించే యస్ బ్యాంక్ సైతం వడ్డీ రేటును ఒక శాతం తగ్గించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.