ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే తరచుగా ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ కాకుండా.. నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాలను వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ క్లోస్ చేసుకోవడానికంటే ముందు తప్పకుండా కొన్ని పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
►బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకునే వ్యక్తి ముందుగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా అందులో ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే దానిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన రెండు నుంచి మూడు నెలల స్టేట్‌మెంట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
►ఒక వేళా మీరు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు. కావున నెగిటీవ్ బ్యాలెన్స్ లేకుండా ముందుగానే చూసుకోవాలి. బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చార్జీలు సరైన సమయంలో చెల్లించని ఎడల బ్యాంక్ బ్యాలన్స్ మైనస్‌లోకి వెళుతుంది. కావున అకౌంట్లో మినిమమ్ బ్యాలన్స్ ఉన్నప్పుడే బ్యాంక్ అకౌంట్ క్లోస్ చేయడానికి వీలుపడుతుంది.
(ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు)
►గతంలో మీరు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎమ్ఐ, ఇతర సబ్‌స్క్రిప్షన్‌లు చెల్లించడానికి ఆటోమాటిక్ క్లియరెన్స్ ఇచ్చి ఉంటే అలాంటివి క్యాన్సిల్ చేసుకోవాలి. ఆలా చేయకపోతే మీరు సమయానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేరు, ఆ తరువాత అదనపు అమౌంట్ వంటివి చెల్లించాల్సి ఉంటుంది.
►ప్రస్తుతం చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపే క్లోజ్ చేస్తే క్లోజర్ చార్జీలు విధిస్తుంది. కావున అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కనీస సంవత్సరం పూర్తయితే అప్పుడు బ్యాంకు అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)
►ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇన్‌కమ్‌టాక్స్ డీటైల్స్ మీ సేవింగ్స్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటే పిఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసుకునేటప్పుడు, ఇన్‌కమ్‌టాక్స్ నుంచి రీఫండ్ వంటివి వస్తే కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు వేరే అకౌంట్ లింక్ చేసిన తరువాత పాత అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎట్టిపరిస్థితుల్లో మరచిపోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment