ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయి. హెడ్జింగ్ చేసుకోవడం ఎలా? – శ్యామ్ ప్రసాద్
ఈక్విటీ మార్కెట్ నష్టపోయే క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఇలా అన్ని సూచీలు పడిపోతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో హెడ్జింగ్ ఆప్షన్ అంతర్గతంగా ఉండదు. కనుక పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడమే ఇన్వెస్టర్ల ముందున్న మార్గం. వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల (అసెట్ అలోకేషన్) ప్రణాళిక కలిగి ఉండడం ఈ దిశగా మంచి వ్యూహం అవుతుంది.
ఉదాహరణకు మీ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మరో 50 శాతాన్ని డెట్ సెక్యూరిటీలు లేదా డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ 70 శాతానికి చేరినప్పుడు.. 20 శాతం మేర విక్రయించి ఆ మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్విటీ/డెట్ రేషియో 50:50గా ఉంటుంది. ఉదాహరణకు రూ. లక్ష పెట్టుబడిలో రూ.50 వేలను ఈక్విటీల్లో, రూ.50 వేలను డెట్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కొంత కాలానికి ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.70 వేలకు చేరి, డెట్ పెట్టుబడుల విలువ రూ.55 వేలకు వృద్ధి చెందిందని అనుకుందాం. అప్పుడు ఈక్విటీల నుంచి రూ.7,500 పెట్టుబడిని వెనక్కి తీసుకుని డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండు సాధనాల్లో పెట్టుబడులు సమానంగా ఉంటాయి.
ఒకవేళ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.50 వేల నుంచి రూ.40 వేలకు తగ్గి, డెట్ పెట్టుబడులు రూ.55వేలుగా ఉన్నాయనుకుంటే.. అప్పుడు డెట్ పెట్టుబడుల నుంచి రూ.7,500ను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సాధనంలో పెట్టుబడుల విలువ మరో సాధనంలోని పెట్టుబడుల విలువ కంటే 10–15 శాతం అధికంగా ఉన్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి. అసెట్ అలోకేషన్ ఆటోమేట్ చేసుకోవడం, రీబ్యాలన్స్ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడం ద్వారా మార్కెట్ల పతనంపై ఆందోళన చెందకుండా రాబడులను పెంచుకోవచ్చు.
రూ.50 లక్షలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శ్రీ కైవల్య
కొంత రక్షణాత్మక ధోరణిలో అయితే మూడేళ్ల పాటు నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకునే ధోరణితో ఉంటే 18 - 24 నెలల సమాన వాయిదాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దిద్దుబాట్లు పెట్టుబడుల అవకాశాలకు అనుకూలం.
ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం విలువ తగ్గిపోతే విచారించాల్సి వస్తుంది. అందుకని ఒకే విడత కాకుండా క్రమంగా నెలకు కొంత చొప్పున కొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. వైవిధ్యమైన నేపథ్యంతో ఉండే ఫ్లెక్సీ క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వృద్ధి, రిస్‌్కను సమతుల్యం చేస్తుంటాయి. దీర్ఘకాల లక్ష్యాలకు ఇవి అనుకూలం. మీ వద్దనున్న మొత్తాన్ని లిక్వి డ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ముందు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాటి నుంచి ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment