న్యూఢిల్లీ: బ్యాటరీ, మొబిలిటీ స్టార్టప్ వ్యవస్థలో.. భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏడాదిలో రావొచ్చని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్‌ఏ) అంచనా వేసింది.
పెట్టుబడులు నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిని నడిపించడంతోపాటు ఈ స్టార్టప్‌లు తయారు చేసే ఉత్పత్తుల పురోగతికి దోహదం చేస్తుందని ఐఈఎస్‌ఏ తెలిపింది. అంతేగాక బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, విడిభాగాల తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని వివరించింది.
స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ద్వా రా అంకుర కంపెనీలను ప్రోత్సహించడానికి ఐఈఎస్‌ఏ చురుకుగా పని చేస్తోంది. ఇప్పటికే 400 స్టార్టప్‌లు, యూనిడో, ఐక్రియేట్, ఇండి యా యాక్సిలరేటర్, ఇతర ప్రముఖ సంస్థల తో చేతులు కలిపింది. స్టార్టప్‌లకు పెట్టుబడి మద్దతు, మార్గదర్శకత్వం, సాంకేతిక ధ్రువీకరణ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి సాయపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment