ముంబై: యూటీఐ మ్యూచువల్ ఫండ్ (UTI) తమ యూటీఐ క్వాంట్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రెడిక్టివ్ మోడలింగ్‌ను పెట్టుబడుల పరిశోధనల్లో యూటీఐకి గల విస్తృత అనుభవం, పెట్టుబడి ప్రక్రియలో అది పాటించే విధానాలను మేళవించి నిర్వహించబడే ఒక యాక్టివ్ ఈక్విటీ ఫండ్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ, విస్తృత సూచీలకు మించిన రాబడులను స్థిరంగా అందించడమనేది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఎన్‌ఎఫ్‌వో 2025 జనవరి 2న ప్రారంభమై 2025 జనవరి 16న ముగుస్తుంది.
యూటీఐ క్వాంట్ ఫండ్ అనేది అధునాతనమైన క్వాంటిటేటివ్ పెట్టుబడుల వ్యూహాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము. బెంచ్‌మార్క్‌లను మించిన రాబడులు అందించే లక్ష్యంతో ఈ ఫండ్, ‘మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ (Low Volatility), విలువ’ అనే నాలుగు అంశాలకు డైనమిక్‌గా వెయిటేజీని కేటాయించేలా ‘ఫ్యాక్టర్ అలొకేషన్’ విధానాన్ని పాటిస్తుంది.
విస్తృత మార్కెట్లో సాధారణంగా కనిపించే హెచ్చుతగ్గులను అధిగమించేందుకు ఈ ఫ్యాక్టర్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే మరింత మెరుగ్గా రిస్కుకు తగ్గ రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ మార్కెట్ సైకిల్స్‌కి అనుగుణంగా మారగలిగే సామర్థ్యాల కారణంగా మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ ఫ్యాక్టర్స్‌వ్యాప్తంగా కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.
ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా ముందుకెళ్లేందుకు ఇది ఒక పటిష్టమైన సాధనంగా ఉపయోగపడగలదు. రిస్కుకు తగ్గట్లుగా రాబడులనిచ్చే విషయంలో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫండ్ పటిష్టమైన పనితీరు కనపర్చింది. కాబట్టి వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులు పొందే అవకాశాలను కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ కాగలదు.
“మార్కెట్ సంక్లిష్టతలను అధిగమించి, పెట్టుబడుల విషయంలో మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకునేలా ఇన్వెస్టర్లకు ఒక క్రమబద్ధమైన మరియు పరిశోధన ఆధారితమైన విధానాన్ని అందించాలనేది మా లక్ష్యం. మా పెట్టుబడి ప్రక్రియ స్కోర్ ఆల్ఫాను (Score Alpha) మా సొంత ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్‌తో (Factor Allocation Model) మేళవించి ఈ ఫండ్ ఒక ‘సమగ్ర పెట్టుబడుల’ విధానాన్ని అమలు చేస్తుంది.
2022 ఏప్రిల్ నుంచి యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఈ ప్రక్రియను అమలు చేస్తోంది. ఈక్విటీ ఫండ్‌కి సంబంధించి ఈ అనుభవాన్ని & విధానాన్ని మరింతగా అందుబాటులోకి తేవడంపై మేము సంతోషిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీ వెట్రి సుబ్రమణియం (Vetri Subramaniam) తెలిపారు.
“రుజువుల ఆధారిత వ్యూహాలతో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించేలా యూటీఐ క్వాంట్ ఫండ్ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలు అందించలేని సరళత్వాన్ని, పరిస్థితులకు తగ్గట్లుగా మారగలిగే సామర్థ్యాలను ఇది అందించగలదు. డైనమిక్‌గా ఉండే నిధుల కేటాయింపు మోడల్ దన్నుతో ఒకవైపు రిస్కులను జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరోవైపు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ ఫండ్ పనిచేస్తుంది. ఇలా రిస్కులు మరియు రాబడుల మధ్య సమతౌల్యతను పాటించగలిగే సామర్థ్యాల కారణంగా, వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులను కోరుకునే వారికి ఈ ఫండ్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలదని ఆశిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ హెడ్ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్) శర్వన్ కుమార్ గోయల్ (Sharwan Kumar Goyal) తెలిపారు.
ప్రధాన అంశాలు
•ఎన్ఎఫ్‌వో వ్యవధి: 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 16 వరకు
•పెట్టుబడి లక్ష్యం: క్వాంటిటేటివ్ పెట్టుబడి థీమ్‌ను అనుసరించడం ద్వారా ఈక్విటీ మరియు సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలిక మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం. అయితే, స్కీము యొక్క లక్ష్యాలు నెరవేరతాయనే కచ్చితమైన హామీ ఉండదు.
•బెంచ్‌మార్క్: BSE 200 TRI
•కనిష్ట పెట్టుబడి: కనిష్ట పెట్టుబడి రూ.1,000.
•పథకాలు: రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి, రెండింటిలో కూడా గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది.
•లోడ్ స్వరూపం: సెబీ నిబంధనల ప్రకారం ఎంట్రీ లోడ్ లేదు. అయితే, అలాట్మెంట్ తేదీ నుంచి 90 రోజుల్లోపుగా రిడీమ్/స్విచ్ అవుట్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది, ఆ తర్వాత ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment