
కొత్తగా బీమా పాలసీలు తీసుకునే వారి సౌలభ్యం కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీ జారీ చేసిన తర్వాతే అందుకు సంబంధించి ప్రీమియం వసూలు చేసుకునేందుకు వీలుగా.. బీమా–ఏఎస్‌బీఏ(Bima-Applications Supported by Blocked Amount) సదుపాయాన్ని అందించాలంటూ అన్ని బీమా సంస్థలను ఆదేశించింది.
ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులు
పాలసీ జారీ అయ్యేంత వరకు ప్రీమియంకు సరిపడా మొత్తం కస్టమర్ బ్యాంక్ ఖాతాలో బ్లాక్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవోలకు ఈ విధానం అమల్లో ఉంది. దీన్ని అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్‌బీఏ) సదుపాయంగా చెబుతారు. ఇదే మాదిరి బీమా–ఏఎస్‌బీఏ విధానాన్ని బీమా పాలసీలకు అమలు చేయాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. మార్చి 1 నాటికి ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ విధానంలో ప్రపోజల్‌ను ఆమోదిస్తున్నట్టు బీమా సంస్థ కస్టమర్‌కు తెలియజేసిన తర్వాతే, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment