bima
-
ఇన్సూరెన్స్ ఇక ఈజీ..'బీమా సుగమ్'కు ఆమోదం..!
-
భవన నిర్మాణ కార్మికులకు అందుతున్న సంక్షేమం కనబడటం లేదా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని సర్కారు నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందిస్తుంటే.. రామోజీరావు మాత్రం వక్ర రాతలతో ఈనాడు పత్రికలో ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ కార్మికుల ‘సంక్షేమానికి సర్కారు ఎసరు’ అంటూ అసత్యాల పునాదులపై ఓ కథనాన్ని నిర్మించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కన్పిస్తోంది. కార్మికుల బిడ్డల విద్యకు ఊతమిస్తున్న ప్రభుత్వం వివాహానికి సైతం ఆర్థిక సాయమందిస్తోంది. ఆ కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించి ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా ఆ కుటుంబానికి బీమా అందించి ప్రభుత్వం ధీమా కల్పిస్తోంది. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలతో ప్రయోజనాలు పొందుతున్నారు. రిజిస్టర్ కాకపోయినా బీమా ఈనాడు రాతలు ఎంత అభూత కల్పనలో ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని బట్టి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రిజిస్టర్ అయినా, కాకపోయినా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా ద్వారా ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోంది. గత ప్రభుత్వం రిజస్టర్ అయినవాళ్లకి మాత్రమే రూ. 5 లక్షలు ఇచ్చేది. రిజిస్టర్ కానివాళ్లకు కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చేది. వివాహాలకు గతంలో ఇచ్చేది కేవలం రూ. 20 వేలు మాత్రమే. ఈ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 40 వేలు అందిస్తోంది. భవన నిర్మాణ కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయితే వారికి వేర్వేరు స్కేల్స్ ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో గరిష్టంగా ఈ పథకంతో రూ. 1.5 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుంది. ఇందులో బోర్డు నుంచి వచ్చేది కేవలం రూ. 40 వేలు. మిగతా డబ్బును ప్రభుత్వం ఖజానా నుంచి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తోంది. గతంలో భవన నిర్మాణ కార్మికుల బిడ్డలకు స్కాలర్ షిప్లుగా కేవలం రూ. 1,200 మాత్రమే ఇచ్చేవారు. గ్రాడ్యుయేషన్కు ఏడాదికి రూ. 5 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం పిల్లలను స్కూలుకు పంపే తల్లికే ఏడాదికి అమ్మఒడి రూపంలో రూ. 15 వేలు ఇస్తోంది. అవి కాకుండా విద్యాదీవెన, వసతి దీవెనలతో పాటు, విదేశీ విద్యా దీవెన తదితర కార్యక్రమాలన్నీ వర్తింపజేస్తోంది. ఇవికాకుండా ప్రభుత్వం అందించే అన్ని పథకాలతో అర్హులైన భవన నిర్మాణ కార్మికులు విస్తృతంగా ప్రయోజనం పొందుతున్నారు. ♦ సహజ మరణాలైతే గత ప్రభుత్వం రూ. 60 వేలు మాత్రమే ఇచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ బీమా కింద రూ. 1 లక్ష అందిస్తోంది. ♦ ప్రమాదాల్లో వైకల్యం సంభవిస్తే ప్రస్తుత ప్రభుత్వం రూ. 5 లక్షలు అందిస్తోంది. ♦ గత ప్రభుత్వం హయాంలో రిజిస్టర్ అవ్వని కార్మికులు ప్రమాదవశాత్తు 50 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం పొందితే రూ. 20 వేలు, 50 శాతంలోపు వైకల్యం అయితే రూ. 10 వేలు వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం ప్రమాద మరణాలకు రూ. 5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ. 2.5 లక్షలు అందిస్తోంది. ♦ ఆస్పత్రుల్లో వైద్యానికి గత ప్రభుత్వం నెలకు రూ. 3 వేలు చొప్పున మూడు నెలల సాయం మాత్రమే అందించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచితంగా చికిత్స అనంతరం కూడా వైద్యులు సూచించిన విశ్రాంతి కాలానికి రోజుకు రూ. 225 గరిష్టంగా నెలకు రూ. 5 వేలు సాయం అందిస్తోంది. -
బీమా పడగ నీడలో భద్రమ్....!
బీమా పేరుతో భారీ దోపిడీ ∙కోటనందూరు మండలంలో రూ.30 కోట్లు స్వాహా! ∙తెల్లకార్డులున్న నిరుపేదలకూ భారీ పాలసీలు ∙తప్పుడు ధ్రువపత్రాతో అక్రమాలు ∙మరణానికి చేరువగా ఉన్నవారే లక్ష్యం ముక్కూమొహం తెలియని వ్యక్తి పేరున బీమా చేస్తారు. బీమా చేశారన్న విషయం ఆ వ్యక్తికీ తెలియదు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురవుతాడు. తనను ఎందుకు చంపుతున్నారో కూడా అతడికి అంతుపట్టదు. అతడి పేరున బీమా మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాజేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పదుల సంఖ్యలో జరుగుతోంది. ఇదేదో సినిమా కథలా ఉంది కదూ. ఏడాది క్రితం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇంచుమించు ఇదే తరహా సంఘటనలు జిల్లాలోనూ చోటుచేసుకుంటున్నాయి. దీని తీగలాగితే మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. – కోటనందూరు మరికొన్నాళ్లలో మరణించే వారి పేరున భారీ మొత్తంలో బీమా పాలసీ చేయించి, వారు చనిపోయాక ఆ పరిహారంలో ఏజెంట్లు వాటా దండుకున్న సంఘటనలు కోటనందూరు మండలంలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా భీమవరపుకోటలో జరిగిన ఇలాంటి వ్యవహారంపై పోలీసు కేసు నమోదు కావడంతో, నకిలీ బీమా పాలసీల బాగోతంలో తీగ దొరికినట్టయింది. బహుళజాతి బీమా కంపెనీల్లో కొందరు ఏజెంట్లు.. ప్రాణాంతక వ్యాధులతో, మరణానికి చేరువులో ఉన్న వారి వివరాలను ముందుగా సేకరిస్తారు. ఈ ప్రక్రియలో వైద్యవృత్తిలో ఉన్నవారు, వ్యాధిగ్రస్తుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటారు. వ్యాధిగ్రస్తుల బంధువులను కలసి, బీమా వ్యవహారంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రీమియం మొత్తం ఏజెంట్ చెల్లిస్తే, పరిహారం మంజూరయ్యాక కొంతభాగం బాధిత కుటుంబానికి ఇవ్వడానికి, ఒకవేళ ప్రీమియం వ్యాధిగ్రస్తుల బంధువులు చెల్లిస్తే, చెరిసగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. భారీగా నగదు వస్తుందన్న ఆశతో నిరుపేద కుటుంబాల వారు సైతం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి వెనుకాడడం లేదు. సాధారణంగా నిర్ణీత వయస్సు వారికి మాత్రమే బీమా సౌకర్యం ఉంటుంది. వృద్ధులకు కూడా తక్కువ వయస్సు నమోదు చేయించి, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించకుండానే ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాల వారు కూడా భారీ మొత్తంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ, బీమా కంపెనీలు ఎందుకు జాగురుకతతో వ్యవహరించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం మంజూరు కోసం వస్తున్న విచారణాధికారులకు ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యమే. స్థిరమైన పెద్ద బీమా కంపెనీల జోలికి ఈ ఏజెంట్లు వెళ్లడం లేదు. కొత్తగా వచ్చిన బీమా కంపెనీలనే వీరు బురిడీ కొట్టిస్తున్నారు. రూ.30 కోట్లు హుష్కాకి! పదేళ్లుగా కేవలం కోటనందూరు మండలంలోనే సుమారు రూ.30 కోట్ల మేరకు ఇలా కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బీమా ఏజెంట్లను కంపెనీ తొలగించగా, మరలా వారే బినామీ పేర్లతో పాలసీలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఎనిమిది కంపెనీలకు ఈ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ ఏజెంట్లు ఇలాంటి వ్యవహారాల్లో చక్రం చక్రం తిప్పుతూ, అనతికాలంలోనే లక్షలాది రూపాయలు గడించారని సమాచారం. ఇలాంటి వ్యవహారాలు కోటనందూరు, జగన్నాథపురం, భీమవరపుకోట, కాకరాపల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్నట్టు తెలిసింది. బీమా మోసాలపై ఫిర్యాదు చేయండి త్వరలో చనిపోతారని భావించిన వారి పేరున బీమా పాలసీ చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సరైన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. కోటనందూరులో ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు.