bhima
-
క్లాప్స్.. విజిల్స్ పడుతూనే ఉన్నాయి
‘‘భీమా’ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎమోషన్ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి క్లాప్స్, విజిల్స్ పడుతూనే ఉన్నాయి. ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరో గోపీచంద్. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ–‘భీమా’ లాంటి మంచి మూవీతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకునేలా చేసిన హర్షకి ధన్యవాదాలు. రాజీ పడకుండా సినిమాని గ్రాండ్‌గా నిర్మించిన రాధామోహన్, శ్రీధర్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా భీమా’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘భీమా’లో ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో ప్రేక్షకుల కేరింతలు చూసి సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఎ. హర్ష. -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్‌గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్‌గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు: గోపీచంద్
మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భీమా'. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో వరంగల్‌లోని హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అందులో డౌటే లేదు ప్రీరిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షను పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు' అని చెప్పారు. ఆయన నవ్వుతోనే ఎనర్జీ.. దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. 'భీమాలో ఎనర్జీ పవర్ వుంది. గోపిచంద్ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. చాలా హంబుల్‌గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి 8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. థియేటర్స్‌లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. చదవండి: సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
Bhimaa HD Photos: గోపీచంద్ ‘భీమా’ మూవీ స్టిల్స్
-
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్‌లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్‌ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఫుల్ జోష్‌తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!) దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్‌తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
ట్రెండ్‌కి తగ్గట్లే 'భీమా' ట్రైలర్.. కాకపోతే ఆ విషయమే?
తెలుగు హీరోల్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. సినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే మాట చాలా కాలమైంది. ఇలాంటి వాళ్లలో గోపీచంద్ ఒకడు. సిక్స్ ఫీట్ కటౌట్‌తో పాటు హీరోకి ఏమేం కావాలో అన్ని ఉన్నాయి ఒక్క హిట్ తప్ప. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తాపత్రయంతో ఉన్నాడు. అలా 'భీమా' చిత్రంతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'భీమా' ఫస్ట్ లుక్, టీజర్ అవి చూస్తే ఇది యాక్షన్ సినిమా అని అర్థమైంది. తాజాగా ట్రైలర్‌తో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓ ఊరు, అందులో విలన్స్, హీరో పోలీస్, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో వాటిని ఎలా ఎదిరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. మరి ఇద్దరు గోపీచంద్లా? లేదా ఒకడే ఇద్దరా అనేది సినిమా వస్తే తెలుస్తోంది. ట్రైలర్ పరంగా చూస్తుంటే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు డివోషనల్ ప్లస్ యాక్షన్ సన్నివేశాలతో ఉంది. అయితే ట్రైలర్లోనే చాలావరకు స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి. దీనిబట్టి చూస్తుంటే సినిమాలోనూ ఫైట్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ లాంటివి గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే 'భీమా'లో దీన్ని మించి ఏముంటుందనేది చూడాలి. అలానే ఇది హిట్ కావడం గోపీచంద్ కి చాలా అవసరం కూడా! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్‌ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఎప్పుడంటే?
రామబాణం తర్వాత మాచో స్టార్ గోపీచంద్ చేస్తున్న చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. గతేడాది నటించిన రామబాణం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపిచంద్‌కు కలిసొచ్చే పోలీస్ పాత్ర గోపీచంద్ 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్స్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర..! See you all in Cinemas with #BHIMAA this Mahashivratri🔱 pic.twitter.com/aeu1jYQIB2 — Gopichand (@YoursGopichand) January 29, 2024 -
జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా శోభిత ధూళిపాళ
హైదరాబాద్: జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెల్స్ ప్రముఖ నటి శోభిత ధూళిపాళను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘మేడ్ టు సెలబ్రేట్ యు’ టీవీ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ‘‘మా బ్రాండ్ ప్రచారానికి శోభితను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. భీమా బ్రాండ్‌కు ఆమె మరింత గుర్తింపు తీసుకొస్తుంది’’ అని సంస్థ ఎండీ అభిõÙక్ బిందుమాధవ్ అన్నారు. అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన భీమా జ్యువెల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం కలిగిస్తుందని శోభిత అన్నారు. -
గోపీచంద్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు, ఎవరంటే?
గోపీచంద్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
భీమ జ్యువెల్స్ మెగా బంపర్ డ్రా: గిప్ట్గా సిట్రోయెన్ కార్లు
హైదరాబాద్: భీమ జ్యువెల్స్ 98వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన బంపర్ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసింది. సోమాజీగూడకు చెందిన రామ సుబ్బమ్మ, విపుల్ సిట్రోయెన్ కార్లను గెలుచుకున్నారు. భీమ సూపర్ సర్ప్రైజ్లో భాగంగా కస్టమర్లకు బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై భారీ తగ్గింపు ఇచ్చింది. బంగారం, వెండి నాణేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేసింది. ప్రతి దుకాణానికి సిట్రోయెన్ కారు ఇచ్చింది. ఈవెంట్లో లక్కీ విజేతలను ప్రకటించడం మరపురాని అనుభవమని కంపెనీ రీజినల్ బిజినెస్ హెడ్ రఘురామ్ రావు తెలిపారు. వ్యాపారవేత్త షేక్ అబ్దుల్ వాజీద్, బిల్డర్ కనకరాజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భీమ జ్యువెల్స్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 13 వరకు నెలరోజుల పాటు ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించింది. -
నీరాలో కేన్సర్ నిరోధకశక్తి
సాక్షి, హైదరాబాద్ /ఉస్మానియా యూనివర్సిటీ: తాటి, ఈత చెట్ల నుంచి లభించే నీరాలో పోషక విలువలతోపాటు కేన్సర్ వ్యాధి నిరోధకశక్తి ఉందని ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయోలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ భీమా వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కలసి తన పరిశోధనల ద్వారా ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా తయారు చేసిన నీరాను అందచేసి, పరిశోధన అంశాలను వివరించారు. కిడ్నిలో రాళ్లు ఏర్పడకుండా కూడా నీరా ఉపయోగపడుతుందని తన అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు భీమాను మంత్రి అభినందించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ నీరా ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.20 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీరాకేఫ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైగౌడ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికోటి రామారావుగౌడ్, శాస్త్రవేత్తలు డా.చంద్రశేఖర్, డా.శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు. -
దండుకుంటున్నా..మీ సేవ
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు కబలిస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దేవుడా ఏమిటీ దయనీయ పరిస్థితి అని రైతులు వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సభలు నిర్వహిస్తున్నారు.తమకు కొంతైనా ఊరటగా ఉంటుందని బీమా చేయించడానికి ఆసక్తి కనబరుస్తుండగా కరువు రైతులను కూడా మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు దండుకుంటున్నారు. అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రొద్దుటూరు : ఓ వైపు కరువు పరిస్థితులు ఉన్నా వరుణదేవుడు కరుణించక పోతాడా అన్న ఆశతో రబీ సీజన్లో రైతులు పంటలను సాగు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అత్యధికంగా శనగ పంటను సాగు చేయగా మిగతా ప్రాంతాల్లో శనగ, వరి, జొన్న తదితర పంటలు వేశారు. వీటిని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల వచ్చిన తిత్లీ, గజ తుపాన్లపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వేలెడు లోతున కూడా భూమిలోకి నీరు ఇంక లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీమా ప్రీమియం చెల్లిస్తున్న రైతులు ఇది ఇలా ఉండగా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది. డిసెంబర్ 15 వరకు శనగ పంటకు, జొన్న, వేరుశనగ, ఉల్లి, మిరప, పొద్దుతిరుగుడు పంటలకు డిసెంబర్ 31, వరి పంటకు 2019 జనవరి 15 వరకు బట్టి ప్రీమియం చెల్లించేందుకు గడువు విధించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో ఎక్కువగా శనగ రైతులు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల మంది ప్రీమియం చెల్లించగా జిల్లాకు సంబం«ధించిన రైతులే 21వేల మంది ఉన్నారు. తర్వాత ప్రకాశం జిల్లాలో 10వేల మంది, అనంతపురం జిల్లాలో 9,300 మంది, కర్నూలు జిల్లాలో 4,800 మంది, విజయనగరం జిల్లాలో 552 మంది, కృష్ణాజిల్లాలో 74 మంది, గుంటూరు జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 7 మంది ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించారు. అదనపు వసూళ్లు.. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు అక్కడే బీమా ప్రీమియంను వసూలు చేయడం జరుగుతుంది. బ్యాంకు రుణం పొందనివారు, కౌలు రైతులు ఎంపిక చేసిన మీ–సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) చెల్లిస్తున్నారు. దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 284 మీ–సేవా కేంద్రాలు ఉండగా ఎంపిక చేసిన కేంద్రాల్లోనే వీటికి అనుమతి మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతు బీమా ప్రీమియానికి సంబంధించిన దరఖాస్తుపై రూ.24 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మీ–సేవా కేంద్రం నిర్వాహకులు ప్రతి ఎకరాకు ప్రీమియంతోపాటు రూ.30 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరా శనగ పంట ప్రీమియం రూ.270 కాగా రూ.300 చొప్పున ప్రొద్దుటూరులో వసూలు చేస్తున్నారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో కూడా ఈ విధంగానే ఫిర్యాదులు అందుతున్నాయి. ఎక్కువ మంది రైతులు ప్రొద్దుటూరుకు వచ్చి ప్రీమియం చెల్లిస్తున్నారు. పలువురు రైతులు ప్రొద్దుటూరు మండల వ్యవసాయాధికారి ఆర్వీ సాగర్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన నిబంధనలను వివరించారు. సమస్యను వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు మురళీకృష్ణకు ఫిర్యాదు చేయగా ఆయన కూడా ఇదే విషయాన్ని తెలిపారు. మిగతా వరి, జొన్న పంటలకు కూడా ఇలానే అదనపు వసూళ్లు చేస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోయి తాము ఇబ్బందులు పడుతుంటే మీ–సేవా నిర్వాహకులు దోచుకోవడం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ధీమానివ్వని బీమా
విజయనగరం గంటస్తంభం: రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. రైతులు 10శాతం ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బీమా ప్రీమియం డీఆర్డీఏ అధికారులు కట్టిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 27వేల మంది ప్రీమి యం చెల్లించారు. గడిచిన మూడేళ్లలో 25వేల నుంచి 30వేల మంది వరకు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టినట్టు సమాచా రం. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోతే ఆ కంపెనీ రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 2015–16 సంవత్సరానికి సం బంధించి 25వేల మంది వరకు రైతులు బీమా కట్ట గా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వి డుదల చేస్తున్నారు. ఇందులో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రీమియం చెల్లించిన రైతులందరికీ పరిహారం రావడం లేదు. మంజూరైన జాబితాలో కూడా చాలామంది రైతుల పేర్లు లేవు. వాస్తవానికి పంటల బీమా గ్రామం యూనిట్‌గా కట్టిస్తారు. కానీ ఒకే గ్రామంలో కొందరికి పరిహారం రావడం, మరికొందరికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఆ జాబితాలో పేర్లున్నా... బ్యాంకు ఖాతాలో కొందరికి జమ కావట్లేదు. పట్టించుకోని అధికారులు బీమా ప్రీమియం కట్టినా పరిహారం రాకపోవడం, పరిహారం వచ్చినా బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోవడంతో రైతులు, రైతు సంఘాల నాయకులు డీఆర్డీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రీమియం చెల్లించినా అసలు నష్టపరిహారం రాకపోతే డీఆర్డీఏ, వ్యవసాయాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిహారం సొమ్ము పడకపోతే బీమా కంపెనీ కూడా స్పందించాలి. కానీ ఎవరూ ట్టించుకోకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వివరాలు చెబితే పరిష్కరిస్తాం ఐసీఐసీఐ కంపెనీకి 2015–16 సంవత్సరం బీమాతో సంబంధం లేదు. తర్వాత నుంచి పంటల బీమా మా కంపెనీ కట్టించుకుం టోంది. కాబట్టి ఆ ఏడాది నుంచి ఎవరికైనా సమస్య ఉంటే వివరాలు తెలియజేస్తే పరిష్కరిస్తాం. సోమవారం సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రీమియం కట్టినా పరి హారం రాకపోయినా, పరిహారం మంజూరై జమ కాకపోయినా రైతుల వివరాలు తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున, ఐసీఐసీఐ లాంబోర్డు బీమా అధికారి ప్రీమియం కట్టినా రాలేదు నాకు పినవేమలి రెవెన్యూలో మూడు ఎకరాల భూమి ఉంది. బీమా కోసం రూ.1540 చెల్లిం చాను. పంట నష్టపోవడంతో బీమా పరిహారానికి ఆ గ్రామం ఎంపికైంది. కొందరు రైతులకు పరిహారం వచ్చింది. కానీ నాకు మాత్రం రాలేదు. ఇదేమని అడిగితే ప్రీమియం మీపేరున కట్టలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. కావాలంటే ప్రీమియం సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదేమి ఘోరం. – సిరిపురం క్రిష్ణంనాయుడు,రైతు కోరుకొండపాలెం -
పశువుల బీమాకు మంగళం?
మూడేళ్లుగా ప్రీమియం కట్టించుకోని అధికారులు ఆర్థికంగా కుంగిపోతున్న పశు పోషకులు రాయవరం (మండపేట) : పశువుల బీమా ప్రీమియాన్ని 2015 మార్చి నుంచి అధికారులు కట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే తీసుకుంటామని చెబుతున్నారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ప్రీమియం చెల్లించాలో అన్న అయోమయంలో పశు పోషకులు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులకు పశు సంపద ప్రధానమైంది. ఈ సంపదను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మనుషులకు మాదిరిగా పశువులకు కూడా బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మూడేళ్లుగా బీమా పథకానికి సంబంధించి సబ్సిడీ విడుదల కావడం లేదు. రైతులు నేరుగా బీమా చేయించుకుంటే అధిక మొత్తం చెల్లించడం భారం అవుతుందని వారు వెనుకంజ వేస్తున్నారు. అర్ధాంతరంగా చనిపోతే.. అప్పు చేసి కొన్న పశువులు అర్ధాంతరంగా మరణిస్తే రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతుంది. మేత కోసం బయటకు వెళ్లిన పశువులు సాయంత్రం తిరిగి వచ్చే వరకు పలు ప్రమాదాలు వెన్నాడుతుంటాయి. విద్యుత్.. రోడ్డు ప్రమాదం..విష పదార్ధాలతో కూడిన గడ్డిని తిన్నప్పుడు.. ప్రకృతి వైపరీత్యాలు.. అగ్ని ప్రమాదాల్లో అవి మృత్యువాత పడుతుంటాయి. గేదెలు, ఆవులు దొమ్మరోగం, గాలికుంటు తదితర జబ్బుల బారిన పడే సమయంలో మరణాలు తప్పడంలేదు. జిల్లాలో 10.21 లక్షల పశువులు పశు సంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 10.21 లక్షల పశువులున్నాయి. వీటికి బీమా చేయించుకునేందుకు గ్రామాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఒక రైతుకు రెండు గేదెలకు బీమా చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కో గేదెకు రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు బీమా లభిస్తుంది. అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా గేదెలకు సంబంధించిన ధర ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణయించిన ధరలో ఏడు శాతం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇందులో రైతు, ప్రభుత్వం చెరిసగం భరించాలి. రైతుకు రూ.1.6 లక్షల వరకూ బీమా వర్తిస్తుంది. ఏడాది, మూడు ఏళ్ల కాల పరిమితికి బీమా సౌకర్యం ఉంది. క్షీరసాగర పథకం కింద 6,7 నెలల గర్భం ఉన్న గేదెలు, ఆవులకు బీమా సౌకర్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకు విధి విధానాలను రూపొందించలేదు. సబ్సిడీ సొమ్ము విడుదల కాలేదు పశువుల బీమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము కాలేదు. బీమా గురించి రైతులు అడుగుతున్నారు. బీమా సౌకర్యం ఉండే పాడి రైతులకు ప్రయోజనం ఉంటుంది. సబ్సిడీ వస్తే పథకం పునరుద్ధరణకు అవకాశం అవకాశం ఉంది. – డీజీఆర్ అంబేడ్కర్, ఈఓ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ