గోపీచంద్‌ 'భీమా'.. రిలీజ్ ఎప్పుడంటే? | Gopichand's Bhimaa Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

Gopichand Movie: గోపీచంద్‌ 'భీమా'.. ఆ క్యారెక్టర్‌ వల్లే భారీ అంచనాలు?

Jan 29 2024 4:28 PM | Updated on Jan 29 2024 4:37 PM

Gopichand Latest Movie Bhima Release Date Locked - Sakshi

రామబాణం తర్వాత మాచో స్టార్ గోపీచంద్‌ చేస్తున్న చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్  ఆఫీసర్ పాత్రలో‌  గోపీచంద్ కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘భీమా’ రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. గతేడాది నటించిన రామబాణం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

గోపిచంద్‌కు కలిసొచ్చే పోలీస్ పాత్ర

గోపీచంద్ 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన​ 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్‌ హిట్‌ కొట్టింది. అందులో 'గంగారామ్'​ రోల్‌లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్స్‌ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. కేజీయఫ్​, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement