పుష్ప-2 కౌంట్ డౌన్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్! | allu arjun Pushpa 2 Trailer Launch Event Planning at a Time In all Over India | Sakshi
Sakshi News home page

Pushpa 2 Trailer: సరిగ్గా నెల రోజులు.. పుష్ప-2 ట్రైలర్‌ కోసం బిగ్‌ ప్లాన్‌!

Published Tue, Nov 5 2024 3:51 PM | Last Updated on Tue, Nov 5 2024 4:18 PM

allu arjun Pushpa 2 Trailer Launch Event Planning at a Time In all Over India

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడు.

పుష్ప-2 విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండడంతో ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్‌, ఫాహద్ ఫాజిల్‌ ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. నెల రోజుల్లోనే పుష్ప-2 రానుందంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా ట్రైలర్‌ త్వరలోనే పేలనుందంటూ హింట్‌ ఇచ్చారు. ‍అయితే ట్రైలర్ రిలీజ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ నెలలోనే పుష్ప-2 ట్రైలర్‌ విడుదలయ్యే అవకాశముంది. కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉండగా.. వరుసగా మరిన్నీ అప్‌డేట్స్‌ ఇవ్వనున్నారు. 

(ఇది చదవండి: ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది)

గ్రాండ్‌గా ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌..

పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్‌ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement