గోపిచంద్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Gopichand's Upcoming Telugu Movie Viswam Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Viswam: గోపిచంద్ విశ్వం.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!

Published Wed, Sep 11 2024 1:59 PM | Last Updated on Wed, Sep 11 2024 2:55 PM

Gopichand's Upcoming Telugu Movie Viswam Lyrical Song Out Now

గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

(ఇది చదవండి: 'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ)

ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ మొరాకన్ మగువా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే విశ్వం టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్‌, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ వేట్టైయాన్‌తో పోటీపడనుంది. అయితే తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం గోపిచంద్‌కు కలిసొచ్చే అవకాశముంది. అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా.. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement