'వస్తాను వస్తానులే' అంటోన్న గోపిచంద్‌.. రొమాంటిక్‌ సాంగ్ చూశారా! | Tollywood Hero Gopichand Latest Movie Viswam Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Gopichand: ముంబయి భామతో గోపిచంద్‌ రొమాన్స్‌.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది!

Published Fri, Oct 4 2024 5:32 PM | Last Updated on Fri, Oct 4 2024 6:18 PM

Tollywood Hero Gopichand Latest Movie Viswam Lyrical Song Out Now

టాలీవుడ్ స్టార్‌ గోపిచంద్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ చిత్రంలో డబుల్ ఇస్మార్ట్‌ భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

(ఇది చదవండి: 'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్‌ కల్యాణ్‌కు మరోసారి కౌంటర్!)

ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ 'మొరాకన్ మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'వస్తాను వస్తానులే' అంటూ సాగే లవ్‌ అండ్ రొమాంటిక్ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా.. వెంగి లిరిక్స్ అందించారు. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్‌, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. ఈనెల 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement