నీరా సీసాలతో ప్రొ.భీమా, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్ /ఉస్మానియా యూనివర్సిటీ: తాటి, ఈత చెట్ల నుంచి లభించే నీరాలో పోషక విలువలతోపాటు కేన్సర్ వ్యాధి నిరోధకశక్తి ఉందని ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయోలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ భీమా వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కలసి తన పరిశోధనల ద్వారా ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా తయారు చేసిన నీరాను అందచేసి, పరిశోధన అంశాలను వివరించారు.
కిడ్నిలో రాళ్లు ఏర్పడకుండా కూడా నీరా ఉపయోగపడుతుందని తన అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు భీమాను మంత్రి అభినందించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ నీరా ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.20 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీరాకేఫ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైగౌడ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికోటి రామారావుగౌడ్, శాస్త్రవేత్తలు డా.చంద్రశేఖర్, డా.శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment