సాక్షి, హైదరాబాద్: గౌడ ఆత్మగౌరవ భవనంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో గౌడ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కులాల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ఎంతో విలువైన భూములు కేటాయించారన్నారు.
అందులో భాగంగా గౌడ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఆత్మగౌరవ భవన నిర్మాణంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని గతంలో గౌడ సంఘాల సమన్వయ సమావేశంలో స్పష్టం చేశామన్నారు. ఇందులో ఎలాంటి అపోహలు నమ్మొద్దని వివిధ గౌడ సంఘాల ప్రతినిధులకు, మేధావులకు, గీత వృత్తిదారులకు, నాయకులకు ఈ సందర్భంగా సూచించారు. సంతకాలు లేకుండా సోషల్ మీడియా ప్రచారంలో పెట్టిన ట్రస్ట్/సొసైటీ నకిలీ డాక్యుమెంట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కావని, గౌడలు ఐక్యంగా ఉండాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment