
మాళవిక, గోపీచంద్, ప్రియాభవానీ
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్.
గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్‌ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్.
Comments
Please login to add a commentAdd a comment