
చెన్నై: కార్యకలాపాల విస్తరణలో భాగంగా రియల్టీ దిగ్గజం జీ స్క్వేర్ రియల్టర్స్ వచ్చే రెండేళ్లలో రూ. 1,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్న కంపెనీ ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువ్యాప్తంగా రెసిడెన్షియల్ విభాగంలోకి విస్తరించాలని భావిస్తోంది. విల్లాలు, అపార్ట్‌మెంట్లను కూడా నిర్మించనుంది. ప్లాట్ మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో గృహాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సంస్థ ఎండీ బలరామజయం తెలిపారు. జీ స్క్వేర్ ఇప్పటివరకు 127 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 15,000 మంది పైగా కస్టమర్లకు సేవలు అందించిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment