
స్మార్ట్‌ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత దాదాపు చాలామంది లావాదేవీల కోసం 'ఫోన్‌పే, గూగుల్ పే' వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. అయితే తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాను.. యూపీఐ పేమెంట్స్ యాప్‌లకు లింక్ చేసుకున్నవారికోసం బ్యాంక్ ఓ సందేశం అందించింది.
బ్యాంక్ అందించిన సందేశం ప్రకారం.. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం 2:30 AM నుంచి 7 AM వరకు.. హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాకు లింక్ అయిన యూపీఐ సేవలు పనిచేయవు. అంటే 4:30 గంటలు యూపీఐ సేవలను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. తన ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సిస్టం మెయిటెనెన్స్ చేపడుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.

హెచ్‌డీఎఫ్‌సీ ప్రకారం.. ఆ సమయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకవేళా ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నవారు.. ప్రైమరీ అకౌంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీని లింక్ చేసి ఉంటే.. అత్యవసరం అనుకుంటే మార్చుకోవడం మంచింది. లేకుంటే 7 గంటల తరువాత యూపీఐ సేవలను యదావిధిగా కొనసాగించవచ్చు.
చదవండి: 'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
కేవలం హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ మాత్రమే ఉన్నవాళ్లు.. ముందుగానే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసి పెట్టుకోండి. ఏదైనా ప్రయాణం సమయంలో, లేదా ఇతర అత్యవసర సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఏ సమయంలో యూపీఐ పనిచేయదనే విషయాన్ని కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ మెయిల్ ద్వారా తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment