హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్‌ఎమ్ఎస్‌లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.
బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్‌లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్‌ఎమ్ఎస్‌లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్‌ఎమ్ఎస్ అలర్ట్‌లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్‌ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.
ఇదీ చదవండి: క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్‌డీఏఐ ఆదేశాలు
అధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్‌ఎమ్ఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment