హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు మూడు గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.
ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం..బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది.
ఇదీ చదవండి: ఏడాదిలో 42 వేల మంది రాజీనామా!
హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) హోల్టర్లకు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, ఫోన్‌పే, వాట్సప్‌పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment