న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్‌హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు.
రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment