‘సాక్షి’ రోజువారీ సర్క్యులేషన్ 12,47,492
ఆంధ్రప్రదేశ్ 8,66,582.. తెలంగాణ 3,71,947.. మెట్రో ఎడిషన్స్ 8,963
తొలి స్థానంలో దైనిక్ భాస్కర్ (హిందీ),
రెండో స్థానంలో దైనిక్ జాగరణ్ (హిందీ)
మూడో స్థానంలో అమర్ ఉజాలా (హిందీ)..
నాలుగో స్థానంలో టైమ్స్ ఆఫ్ ఇండియా (ఇంగ్లీష్)
సాక్షి, అమరావతి: ‘సత్యమేవ జయతే’ నినాదంతో తెలుగు నేలపై 2008 మార్చి 23వతేదీన ప్రారంభమైన ‘సాక్షి’ పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. ఉన్నది ఉన్నట్టుగా.. నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘సాక్షి’ అశేష పాఠకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది.
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించిన ఆడిటింగ్‌లో నిత్యం 12,47,492 కాపీలతో (15,480 వేరియంట్ సహా) దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రికల్లో ‘సాక్షి’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో 8,66,582, తెలంగాణలో 3,71,947, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 సర్క్యులేషన్‌తో ‘సాక్షి’ పాఠకాదరణలో దూసుకెళ్తున్నట్లు ఏబీసీ వెల్లడించింది.
తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలు
తాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్‌లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దైనిక్ భాస్కర్ (హిందీ) పత్రిక 30,73,304 సర్క్యులేషన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 24,42,728 సర్క్యులేషన్‌తో దైనిక్ జాగరణ్ (హిందీ) రెండో స్థానంలో నిలవగా.. అమర్ ఉజాలా (హిందీ) 17,05,529 సర్క్యులేషన్‌తో మూడో స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (ఇంగ్లీష్) నాలుగో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment