Audit Bureau of Circulation
-
దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఎనిమిదో స్థానంలో ‘సాక్షి’
సాక్షి, అమరావతి: ‘సత్యమేవ జయతే’ నినాదంతో తెలుగు నేలపై 2008 మార్చి 23వతేదీన ప్రారంభమైన ‘సాక్షి’ పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. ఉన్నది ఉన్నట్టుగా.. నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘సాక్షి’ అశేష పాఠకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించిన ఆడిటింగ్‌లో నిత్యం 12,47,492 కాపీలతో (15,480 వేరియంట్ సహా) దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రికల్లో ‘సాక్షి’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.ఆంధ్రప్రదేశ్‌లో 8,66,582, తెలంగాణలో 3,71,947, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 సర్క్యులేషన్‌తో ‘సాక్షి’ పాఠకాదరణలో దూసుకెళ్తున్నట్లు ఏబీసీ వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలుతాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్‌లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దైనిక్ భాస్కర్ (హిందీ) పత్రిక 30,73,304 సర్క్యులేషన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 24,42,728 సర్క్యులేషన్‌తో దైనిక్ జాగరణ్ (హిందీ) రెండో స్థానంలో నిలవగా.. అమర్ ఉజాలా (హిందీ) 17,05,529 సర్క్యులేషన్‌తో మూడో స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (ఇంగ్లీష్) నాలుగో స్థానంలో నిలిచింది. -
ఏపీఏబీసీ ప్రెసిడెంట్‌గా హొర్మూజ్ మసానీ
న్యూఢిల్లీ: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ–ఇండియా) జనరల్ సెక్రెటరీ హొర్మూజ్ మసానీ వరుసగా ఐదోసారి ఏషియా పసిఫిక్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సరి్టఫికేషన్ (ఏపీఏబీసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సరి్టఫికేషన్ (ఐఎఫ్ఏబీసీ) సర్వసభ్య సమావేశంలో ఆయనను ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆనరరీ ట్రెజరర్ హోదాలో ఐఎఫ్ఏబీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్‌గా కూడా మసానీ వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. ఆయన 1998 నుంచి ఏబీసీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. 2008 నుంచి ఐఎఫ్ఏబీసీలో ఏబీసీ–ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
కోర్టు ఉత్తర్వులకూ తప్పుడు భాష్యం
సాక్షి– అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ప్రతీ రోజూ తప్పుడు కథనాలు వండివారుస్తున్న ఈనాడు దినపత్రిక, తాజాగా కోర్టు ఉత్తర్వుల విషయంలోనూ అదే వైఖరిని బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లు ప్రచురించి, ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ‘సాక్షి’ దినపత్రిక సర్క్యులేషన్ వివరాలను వెల్లడించవద్దంటూ ఆడిట్బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌ను (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి సర్క్యులేషన్ వివరాలను తనకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు... ఈ నెల 27వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్ వివరాలనూ వెల్లడి చేయవద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ‘ఈనాడు’తో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి. కానీ ‘ఈనాడు’ మాత్రం... ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్ వివరాలను మాత్రమే వెల్లడించవద్దని ఏబీసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా కథనాన్ని ప్రచురించటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాలు చూస్తే... విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవటానికి గ్రామ, వార్డు వలంటీర్లకు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆ మేర బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలన్నది చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వలంటీర్లకు ఛాయిస్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రై వేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వలంటీర్లు, సచివాలయాలు ఒకవేళ ‘సాక్షి’ దినపత్రికను కొనుగోలు చేస్తే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కులేషన్ను (ఏబీసీ) ఆదేశించడంతో పాటు నిర్ధిష్ట కాలాల్లో సాక్షి పత్రికు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్‌ను పునస్సమీక్ష చేయాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక ప్రభుత్వ జీవోల అమలును నిలిపేయడంతో పాటు, 2022 జూలై– డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్కులేషన్ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. అనంతరం ఉషోదయ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేసింది. దీనిపై ఉషోదయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత ఏడాది ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉషోదయ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉషోదయ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జూలై నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే సర్క్యులేషన్ వివరాలను వెల్లడి చేయకుండా ఏబీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బుధవారం (మార్చి 13) ఉషోదయ మరో పిటిషన్ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏబీసీ తరఫు న్యాయవాది ఎవరూ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజా సర్కులేషన్ వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంటూ ఏబీసీకి నోటీసులిచ్చింది. అంతేకాక ఈ నెల 27 వరకూ తెలుగు దినపత్రికలన్నింటి సర్కులేషన్ వివరాలను వెల్లడి చేయవద్దని కూడా ఏబీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉంటే, ఈనాడు మాత్రం ఆ ఉత్తర్వులను దురుద్దేశాలతో తప్పుగా ప్రచురించింది. ఢిల్లీ హైకోర్టు ‘సాక్షి’ సర్కులేషన్ వివరాలను, గణాంకాలు ప్రచురించవద్దంటూ ఏబీసీని ఆదేశించినట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించి తన నైజాన్ని చాటుకుంది. -
ABC: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసన్ స్వామి
న్యూస్ పేపర్ల సర్క్యులేషన్‌ను ప్రకటించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ABCకి కొత్త కార్యవర్గం ఎన్నికయింది. 2023-24 ఏడాదికి గాను ABC ఛైర్మన్‌గా శ్రీనివాసన్ K.స్వామి ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ ఎన్నికకు సంబంధించి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఒక అధికారిక ప్రకటన చేసింది. శ్రీనివాసన్ ప్రస్తుతం RK స్వామి హన్స గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాసన్.. వివిధ హోదాల్లో ఎన్నో సేవలందించారు. గతంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసొసియేషన్‌కు ఛైర్మన్‌గా, అలాగే ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసొసియేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అసొసియేషన్లోనూ ఆయన సేవలందించారు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా తరపున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గతంలో అందుకున్నారు శ్రీనివాసన్. చదవండి: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ 2023-24కు గాను ఎన్నికయిన కార్యవర్గం వివరాలు ► డిప్యూటీ ఛైర్మన్ - రియాద్ మాథ్యూ (చీఫ్ అసొసియేట్ ఎడిటర్, మలయాళ మనోరమా) ►గౌరవ కార్యదర్శి - మోహిత్ జైన్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బెన్నెట్ కోలెమన్) ►ట్రెజరర్ - విక్రమ్ సకుజా(గ్రూప్ సీఈవో, మాడిసన్ కమ్యూనికేషన్స్) ABCలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రతినిధులు ►శ్రీనివాసన్ స్వామి, ఛైర్మన్ ►విక్రమ్ సకుజా, ట్రెజరర్ ►ప్రశాంత్ కుమార్, సభ్యులు ►వైశాలి వర్మ, సభ్యులు పబ్లిషర్స్ ప్రతినిధులుగా ►రియాద్ మాథ్యూ, డిప్యూటీ ఛైర్మన్ ►ప్రతాప్ జి.పవార్, సకల్ పేపర్స్ ►శైలేష్ గుప్తా, జాగరన్ ప్రకాషణ్ ►ప్రవీణ్ సోమేశ్వర్, HT మీడియా ►మోహిత్ జైన్, బెన్నెట్ కోలెమన్ ►ధృబ ముఖర్జీ, ABP ►కరణ్ దర్దా, లోక్మత్ ►గిరీష్ అగర్వాల్, DB ఎన్నికయ్యారు కరుణేష్ బజాజ్, ITC, అనిరుద్ధ హల్దార్, శశాంక్ శ్రీవాస్తవ, మారుతీ సుజుకి కార్పోరేట్ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. -
ఏబీసీ నూతన చైర్మన్‌గా ప్రతాప్ పవార్
న్యూఢిల్లీ: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ప్రతాప్ పవార్ ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక ‘సకల్’ను ప్రచురించే సకల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. 2022–23 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మహ్రాత్తా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్(పుణే) అధ్యక్షుడిగా సేవలందించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ప్రతాప్ పవార్‌ను భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా శ్రీనివాసన్ కె.స్వామి ఎన్నికయ్యారు. -
ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
న్యూఢిల్లీ: 2021–2022 ఏడాదికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏబీసీ కౌన్సిల్ పబ్లిషర్ సభ్యులైన ప్రతాప్ జి. పవార్.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అడ్వటైజర్స్ రిప్రజెంటేటివ్స్‌గా ఐటీసీ సంస్థ తరఫున కరుణేశ్ బజాజ్, టీవీఎస్ మోటార్ కంపనీ తరఫున అనిరుద్ధ హల్దార్, మారుతి సుజుకీ ఇండియా తరఫున శశాంక్ శ్రీవాస్తవ ఉన్నారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ పబ్లిషర్స్ రిప్రజెంటేటివ్స్‌గా సకల్ పేపర్స్ సంస్థ తరఫున ప్రతాప్ పవార్, మలయాళ మనోరమ తరఫున రిషద్ మాథ్యూ, లోక్మత్ మీడియా తరఫున దేవేంద్ర వి. దర్దా, ది బాంబే సమాచార్ తరఫున హర్ముస్జీ ఎన్. కామా, జాగరణ్ ప్రకాశన్ తరఫున శైలేశ్ గుప్తా, హెచ్‌టీ మీడియా తరఫున ప్రవీణ్ సోమేశ్వర్, బెన్నెట్,కోల్మన్ అండ్ కో తరఫున మోహిత్ జైన్, ఏబీపీ తరఫున ధ్రువ ముఖర్జీ ఉన్నారు. అడ్వటైజింగ్ ఏజెన్సీల రిప్రజెంటేటివ్స్‌గా మ్యాడిసన్ కమ్యూనికేషన్స్ తరఫున విక్రమ్ సఖూజా, ఐపీజీ మీడియాబ్రాండ్స్ తరఫున శశిధర్ సిన్హా, ఆర్కే స్వామి బీబీడీవో తరఫున శ్రీనివాసన్ కె. స్వామి, డెంట్సు ఏగిస్ నెట్వర్క్ కమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ తరఫున ఆశిశ్ భాసిన్ ఉన్నారు. సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్ మాసాని కొనసాగనున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన -
ఏబీసీ చైర్మన్‌గా మధుకర్
ముంబై: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కామత్‌ను 2019–20 కాలానికిగానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్మత్ మీడియా సంస్థకు చెందిన దేవేంద్ర.వి.దర్దా ఏడాది కాలానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఏబీసీ మండలిలో శశిధర్ సిన్హా(మీడియా బ్రాండ్స్), శ్రీనివాసన్.కె.స్వామి(ఆర్కే స్వామి బీబీడీవో), హార్ముష్‌జీ ఎన్.కమా(బాంబే సమాచార్), రియద్ మాథ్యూ(మలయాళ మనోరమ) విక్రమ్ సఖూజా(మాడిసన్ కమ్యూనికేషన్) తదితరులు ఉన్నారు. పబ్లిషర్లు, యాడ్ ఏజెన్సీలు, ప్రకటనదారులు సభ్యులుగా ఉండే ఏబీసీ వార్తాపత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్లను మదింపు చేస్తుంది. -
ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పత్రికల సర్క్యు లేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా కోకకోలా సంస్థ ఆగ్నేయాసియా రీజియన్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017–18 సంవత్సరానికి గాను ఈ పదవిలో ఉంటారు. వ్యూహాత్మక ప్రణాళికలు, విక్రయాలు, మార్కెటింగ్ ఆపరేషన్లలో 23 ఏళ్లకుపైగా అనుభవమున్న ఆయన.. దేశంలో కోకకోలా సంస్థ విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్లను విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ముంబై సమాచార్ పత్రికకు చెందిన హర్మూస్జీ ఎన్ కమా, ఏబీసీ సచివాలయం సెక్రటరీ జనరల్‌గా హర్మూజ్ మాసాని ఎన్నికయ్యారు. వీరితోపాటు అడ్వర్టైజర్లు, పబ్లిషర్లు, అడ్వరై్టజింగ్ ఏజెన్సీల ప్రతినిధులుగా ఎన్నికైనవారి జాబితాను ఏబీసీ గురువారం విడుదల చేసింది. అడ్వరై్టజర్ల ప్రతినిధులు.. దేబబ్రత ముఖర్జీ, కొకాకోలా ఇండియా లిమిటెడ్ (చైర్మన్) హేమంత్ మాలిక్, ఐటీసీ లిమిటెడ్ (గౌరవ కార్యదర్శి) సందీప్ తర్కాస్, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మయాంక్ పరీక్, టాటా మోటార్స్ లిమిటెడ్ పబ్లిషర్ల ప్రతినిధులు.. హర్మూస్జీ ఎన్ కమా, ది బాంబే సమాచార్ (డిప్యూటీ చైర్మన్) ఐ.వెంకట్, ఉషోదయా ఎంటర్ప్రైజెస్ శైలేష్ గుప్తా, జాగరణ్ ప్రకాశన్ దేవేంద్ర వి దార్దా, లోక్మత్ మీడియా బెనాయ్ రాయ్ చౌధురి, హెచ్‌టీ మీడియా చందన్ మజుందార్, ఏబీపీ రాజ్‌కుమార్ జైన్, బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ ప్రతాప్ జి.పవార్, సకల్ పేపర్స్ అడ్వరై్టజింగ్ ఏజెన్సీల ప్రతినిధులు మధుకర్ కామత్, డీడీబీ ముద్రా ప్రైవేట్ లిమిటెడ్ (గౌరవ కోశాధికారి) శశిధర్ సిన్హా, ఐపీజీ మీడియా బ్రాండ్స్ శ్రీనివాసన్ కె స్వామి, ఆర్కే స్వామి బీబీడీవో ప్రైవేట్ లిమిటెడ్ సీవీఎల్ శ్రీనివాస్, గ్రూప్ ఎం మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -
ఏటా 5.08% పెరుగుతున్న ప్రింట్ మీడియా
పత్రికల ఆడిట్ సంస్థ ఏబీసీ వెల్లడి ముంబై: విదేశాల మాదిరి కాకుండా భారత్‌లో ప్రచురణ మాధ్యమం అంతకంతకూ పెరుగుతోంది. టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియా నుంచి తీవ్రపోటీని తట్టుకుంటూ కూడా దేశంలో ప్రింట్ మీడియా ఏటా 5.04 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నట్లు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) తెలియజేసింది. ఈ సంస్థ 68 ఏళ్లుగా పత్రికల సర్క్యులేషన్‌ను ప్రతి 6 నెలలకు ధ్రువీకరిస్తుంటుంది. 90 ఆడిటింగ్ సంస్థల ద్వారా ప్రాసెస్ చేసి గణాంకాలను ధ్రువపరుస్తున్నట్లు ఏబీసీ తెలియజేసింది. ప్రస్తుతం తమ పరిధిలో 669 వార్తా పత్రికలు, 50 మ్యాగజైన్లు నమోదై ఉన్నట్లు సంస్థ తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్లుగా ఏటా 5.04 శాతం చొప్పున ప్రింట్ మీడియా పెరుగుతూనే వస్తోంది. ‘ప్రస్తుత పత్రికలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో పాటు కొత్త పత్రికలూ పుట్టుకొస్తున్నాయి. అందుకే ఈ వృద్ధి సాధ్యమైంది’ అని సంస్థ తెలిపింది.