ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నూతన చైర్మన్ మధుకర్ కామత్
ముంబై: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కామత్‌ను 2019–20 కాలానికిగానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్‌మత్ మీడియా సంస్థకు చెందిన దేవేంద్ర.వి.దర్దా ఏడాది కాలానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఏబీసీ మండలిలో శశిధర్ సిన్హా(మీడియా బ్రాండ్స్), శ్రీనివాసన్.కె.స్వామి(ఆర్కే స్వామి బీబీడీవో), హార్ముష్‌జీ ఎన్.కమా(బాంబే సమాచార్), రియద్ మాథ్యూ(మలయాళ మనోరమ) విక్రమ్ సఖూజా(మాడిసన్ కమ్యూనికేషన్) తదితరులు ఉన్నారు. పబ్లిషర్లు, యాడ్ ఏజెన్సీలు, ప్రకటనదారులు సభ్యులుగా ఉండే ఏబీసీ వార్తాపత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్లను మదింపు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment