pending list
-
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
ఇద్దరు సిట్టింగులకు మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ప్రచార పర్వాన్ని ఖరారు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పెండింగ్‌లో ఉన్న 14 స్థానాల అభ్యర్థులపైనా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి వరుసగా నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్(వనపర్తి), వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని స్థాయిల్లోని టీఆర్ఎస్ నేతలను, శ్రేణులను ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేయడం, అభ్యర్థులను పరిచయం చేస్తూ మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరడం ప్రధాన ఉద్దేశంగా ఈ సభలను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల బహిరంగసభలు కావడంతో వీటి నిర్వహణకు ముందే.. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. సోమవారం లేదా మంగళవారం టీఆర్ఎస్ రెండో జాబితా వెల్లడించే అవకాశం ఉందని పార్టీ అధిష్టాన వర్గాలు తెలిపాయి. గెలుపు ప్రాతిపదికగా సామాజిక వర్గాలను పరిశీలించడంతోపాటు ప్రతిపక్షాల కూటమి తరఫున అభ్యర్థులు ఎవరుంటారనే అంచనాలతో పెండింగ్ జాబితాను ఖరారు చేశారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 105 స్థానాలకు సెప్టెంబర్ 6న ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలలో 83 మందికి మళ్లీ అవకాశం ఇచ్చారు. నల్లాల ఓదెలు(చెన్నూరు), బాబూమోహన్(అంథోల్)కు మాత్రం టికెట్లు నిరాకరించారు. కొండా సురేఖ(వరంగల్ తూర్పు), బొడిగె శోభ(చొప్పదండి), ఎం.సుధీర్‌రెడ్డి(మేడ్చల్), కనకారెడ్డి(మల్కాజ్గిరి), బి.సంజీవరావు(వికారాబాద్) అభ్యర్థిత్వాలను పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానాలతోపాటు మరో 9 సెగ్మెంట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తొలి జాబితా అనంతరం కొండా సురేఖ టీఆర్ఎస్ అధిష్టానంపై విమర్శలు చేసి కాం గ్రెస్‌లో చేరారు. దీంతో మరో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల భవితవ్యం తేలాల్సి ఉండగా.. మేడ్చల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించినట్లేనని టీఆర్ఎస్ అధిష్టాన వర్గాలు తెలిపాయి. మేడ్చల్‌లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని లోక్‌సభ సభ్యుడు మల్లారెడ్డికి, మల్కాజ్‌గిరిలో ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు పార్టీ అధిష్టానం సూచించింది. చొప్పదండి విషయంలోనూ ఇదే నిర్ణయం జరగనుందని తెలిసింది. పెండింగ్‌లో పెట్టిన 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా.. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా సర్వేల తో సమాచారం సేకరిస్తున్నారు. జాబితా ప్రకటించే రోజుకు వీటిలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ♦ మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డికి మేడ్చల్ సీటు ఖరారు చేసినప్పటికీ, తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజ్గిరి టికెట్ ఖరారైంది. తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి తన కోడలు విజయశాంతికి టికెటివ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ♦ గోషామహల్ టికెట్‌ను దానం నాగేందర్‌కు ఓకే చేసి, ప్రచారం చేసుకోవాలని రెండు వారాల క్రితమే సూచించింది. నాగేందర్ మాత్రం తనకు ఖైరతాబాద్ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ♦ ఖైరతాబాద్ టికెట్‌ను పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఇస్తూ టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీలో టీఆర్ఎస్ తరపున ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేగా ఉండేవారు. వీరిలో నలుగురికే తాజాగా మళ్లీ అభ్యర్థిత్వాలు ఇచ్చారు. ♦ ముషీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ ను ఖరారు చేయగా, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి కోసం హోంమంత్రి నాయిని ప్రయత్నిస్తున్నారు. ♦ అంబర్‌పేట టికెట్‌ను కాలేరు వెంకటేశ్‌కు ఇవ్వగా, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గడ్డం సాయికిరణ్ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చొప్పదండిలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ అభ్యర్థిగా ఖరారయ్యారు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు జహీరాబాద్ స్థానం ఖరారైంది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మానిక్‌రావు ఇంకా యత్నాలు చేస్తున్నారు. ♦ వికారాబాద్ స్థానాన్ని కొత్త అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయించింది. టి.విజయ్‌కుమార్, ఎస్.ఆనంద్‌లో ఒకరిని తుది జాబితాలో ప్రకటించనుంది. తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు యత్నాలు కొనసాగిస్తున్నారు. ♦ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్ వరంగల్æ మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకుడు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి పేర్లను పరిశీలిస్తోంది. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ♦ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో నల్లగొండ లోక్‌సభ సభ్యుడు సుఖేందర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, శానంపూడి సైదిరెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. సుఖేందర్రెడ్డివైపే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ♦ మహాకూటమిపై స్పష్టత వచ్చాక కోదాడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ లోని ఒక నాయకుడిని టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వేనేపల్లి చందర్రావులో ఒకరిని తుది జాబితాలో చేర్చనున్నారు. ♦ చార్మినార్, మలక్‌పేటలో ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు ముఖీద్‌చంద్, చవ్వా సతీష్, అజంఅలీలో ఇద్దరిని టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. -
ఈసారైనా ఒనగూరేనా?
అధ్యయనానికే పరిమితమైన వరల్డ్‌క్లాస్ ఏళ్లు గడిచినా ముందుకు కదలని ప్రతిపాదనలు సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి ఏ మాత్రం పట్టని నాంపల్లి స్టేషన్ అభివృద్ధి అదనపు టర్మినళ్లపై కదలిక శూన్యం సాక్షి, సిటీబ్యూరో: ప్రతి బడ్జెట్ ఒక ప్రహసనం. ప్లాట్‌ఫామ్‌పైకి ఒకదాని తరువాత మరొకటి రైలొచ్చినట్లుగా బడ్జెట్లకు బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కానీ నగరానికి పెద్దగా ఒనగూరిన ప్రయోజనం మాత్రం లేదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ జాబితాలోనే పేరుకుపోతున్నాయి. ఏటా కొత్త రైళ్లు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కానీ అందుకు తగిన విధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో రైళ్లరాకపోకల్లో గంటల తరబడి జాప్యం చోటుచేసుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో రైల్వే బడ్జెట్ రానున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో, లక్షలాది మంది ప్రయాణికుల తాకిడితో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సమూలంగా మార్చివేయాలని సూచించారు. మరోవైపు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా మరిన్ని టర్మినళ్లు నిర్మించాలన్న సీఎం సూచన చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ప్రస్తుత స్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా మల్కాగిరి, మౌలాలీ, హైటెక్‌సిటీ వంటి రైల్వేస్టేషన్లను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్న ఆరేళ్ల నాటి బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అధ్యయనాలకే పరిమితమైన వరల్డ్‌క్లాస్... మినీ భారత్‌ను తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80కిపైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, 122 సబర్బన్, ఎంఎంటీఎస్‌లు రాకపోకలు సాగిస్తాయి. వీటికితోడు ఏటా 3 నుంచి 4 కొత్త రైళ్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న 10 ప్లాట్‌ఫామ్‌లు ఏ మాత్రం చాలడంలేదు. ఒక రైలు ప్లాట్‌ఫామ్ వదిలితే కానీ మరో రైలు స్టేషన్లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. దీంతో చాలా రైళ్లు నగర శివార్లలోనో, సమీప స్టేషన్లలోనో నిలిపివేస్తున్నారు. ఈ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని సుమారు రూ.5 వేల కోట్లతో 2008 బడ్జెట్లోనే ప్రతిపాదించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రతిపాదన ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. అధ్యయనాలకే పరిమితమైంది. సికింద్రాబాద్‌ను వరల్డ్‌క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తే విమానాశ్రయం తరహాలో ఎలివేటెడ్ లైన్లను నిర్మిస్తారు. స్టేషన్‌కు చేరుకునే రైళ్లన్నీ ఒకవైపు నుంచి, స్టేషన్ నుంచి బయలుదేరేవన్నీ మరోవైపు నుంచి వెళ్లే విధంగా లైన్లు, ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్, సబర్బన్ సర్వీసుల కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయి. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం లేకుండా, ఆలస్యానికి తావు లేకుండా నిర్వహణ సాధ్యమవుతుంది. ఆచరణకు నోచని అదనపు టర్మినళ్లు.... సికింద్రాబాద్‌తోపాటు నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరుతారు.నాంపల్లి,కాచిగూడ స్టేషన్లలో 5 ప్లాట్‌ఫామ్‌ల చొప్పున ఉన్నప్పటికీ 18 బోగీల కంటే ఎక్కువ బోగీలున్న దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు అనుకూలంగా లేవు. ఒకటి, రెండు స్టేషన్లలో మాత్రమే ఆ సదుపాయం ఉంది. దీంతో అన్ని రైళ్లను సికింద్రాబాద్‌కే మళ్లిస్తున్నారు. ఆ విధంగా కూడా సికింద్రాబాద్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మౌలాలీ, మల్కాజిగిరి స్టేషన్లను భారీ టర్మినళ్లుగా నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. కలగానే ఎంఎంటీఎస్ ప్రత్యేక లైన్... రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే కూడా లోకల్ ట్రైన్‌కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్న లక్ష్యంతో 2003లో ప్రారంభించిన ఎంఎంటీఎస్‌కు అడుగడుగునా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నగరంలోని నాలుగు ప్రధాన మార్గాల్లో రోజూ 121 సర్వీసులతో సుమారు లక్షా 70 వేల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తోన్న ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేకంగా ఓ లైన్ వేయాలన్న ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచలేదు.