ట్రేడింగ్ ఖాతాల ప్రారంభం సులభ తరం
ముంబై: వ్యక్తిగత ఇన్వెస్టర్లు సులభంగా కొత్త ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించే వీలు కల్పిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకోసం సరళ్ పేరిట అకౌంటు ఓపెనింగ్ ఫారమ్‌ను ప్రవేశపెట్టింది. సాధారణంగా చాలా మటుకు కొత్త ఇన్వెస్టర్లు.. ఇంటర్నెట్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్ వంటి సదుపాయాలు తీసుకోకుండా ప్రధానంగా క్యాష్ సెగ్మెంట్‌తోనే మార్కెట్‌లోకి అడుగుపెడతారని సెబీ పేర్కొంది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకే కొత్త ఫారమ్‌ను ప్రవేశపెట్టినట్లు, చిరునామా ధృవీకరణ పత్రాల నిబంధనలను కూడా సడలించినట్లు తెలిపింది.