SEBI regulations
-
మెరుగైన సమాచార లభ్యతపై దృష్టి
సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మెరుగైన, సరైన సమాచారం లభించేలా చూడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్ఫార్మెన్స్ వేలిడేషన్ ఏజెన్సీ (పీవీఏ), డేటా బెంచ్‌మార్కింగ్ ఇన్స్టిట్యూషన్ (డీబీఐ) అనే రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), ఆల్గోరిథం ప్రొవైడర్లు తాము అందించే సర్వీసుల పనితీరుకు సంబంధించి తెలియజేసే వివరాలను పీవీఏ నిర్ధారిస్తుంది. ఇక, వివిధ అసెట్ క్లాస్‌లకు సంబంధించి ప్రామాణికంగా ఉన్న, పోల్చి చూసుకోతగిన డేటాను అందించే సెంట్రల్ రిపాజిటరీగా డీబీఏ పని చేస్తుంది. 2023–24 వార్షిక నివేదికలో సెబీ ఈ విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఇన్వెస్టర్లు చెల్లించే ఫీజులు కచ్చితంగా రిజిస్టర్డ్ ఐఏలు, ఆర్‌ఏలకే అందే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సెబీ పేర్కొంది.ఇదీ చదవండి: అంతర్జాతీయ పరిణామాలు కీలకంఅన్రిజిస్టర్డ్ సంస్థలను ఇన్వెస్టర్లు గుర్తించేందుకు, వాటికి దూరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని సెబీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల లభ్యతకు తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ఈ విషయంలో మార్కెట్ వర్గాల అవసరాలను తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన్వీట్స్) కోసం అడ్వైజరీ కమిటీ వేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు స్వచ్ఛంద డీలిస్టింగ్ నిబంధనలను సమీక్షించడం తదితర చర్యలు కూడా తీసుకోనున్నట్లు సెబీ తెలిపింది. -
రిషద్ ప్రేమ్‌జీకి పదవీ గండం?!
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ త్వరలోనే తన పదవిని కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సెబీ (స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ) నియమాల ప్రకారం..ప్రధమ శ్రేణి (5000 కంపెనీల) చైర్మన్, సీఈవోలు వేరు వేరు వ్యక్తులు ఉండాలన్న నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. విప్రో మాత్రం రిషద్‌నే కొనసాగించాలని సెబీని కోరనుంది. సెబీ కొత్త నియమాల ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నే బోర్డు చైర్‌పర్సన్‌గా నియమించాలి. మరోవైపు ప్రాక్సీ అడ్వైజరీ సర్వీసస్ ఎండీ శ్రీరాం సుబ్రహ్మణియన్ స్పందిస్తూ..రిషద్‌కు రెండు ప్రత్యామ్నాలున్నాయని..ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని వదులుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జాయింట్ ఎండీ పదవులను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. తాజా సెబీ నిమయాల ప్రకారం ప్రమోటర్లకు 74 శాతం షేర్లు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోలేరు. కాగా విప్రో షేర్స్‌ను అజీమ్ ప్రేమ్‌జీ పౌండేషన్‌కు ఇచ్చినప్పటికి.. ఓటింగ్ హక్కులు కలిగి ఉంటారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. మరోవైపు గత సంవత్సరం రిషద్ తండ్రి అజీమ్ ప్రేమ్ జీ తప్పుకోవడంతో రిషద్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. చదవండి: విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్!! -
ట్రేడింగ్ ఖాతాల ప్రారంభం సులభ తరం
ముంబై: వ్యక్తిగత ఇన్వెస్టర్లు సులభంగా కొత్త ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించే వీలు కల్పిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకోసం సరళ్ పేరిట అకౌంటు ఓపెనింగ్ ఫారమ్‌ను ప్రవేశపెట్టింది. సాధారణంగా చాలా మటుకు కొత్త ఇన్వెస్టర్లు.. ఇంటర్నెట్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్ వంటి సదుపాయాలు తీసుకోకుండా ప్రధానంగా క్యాష్ సెగ్మెంట్తోనే మార్కెట్లోకి అడుగుపెడతారని సెబీ పేర్కొంది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకే కొత్త ఫారమ్‌ను ప్రవేశపెట్టినట్లు, చిరునామా ధృవీకరణ పత్రాల నిబంధనలను కూడా సడలించినట్లు తెలిపింది. -
ఆ సొమ్మెక్కడిదో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకపోతే సీబీఐ, కంపెనీల రిజిస్ట్రార్ దర్యాప్తునకు సిద్ధం కావాల్సిందేనని సహారా గ్రూప్‌ను సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. సొవుు్మ ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించడానికి నిరాకరించిన సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌తో పాటు గ్రూప్‌ను తీవ్రస్థారుులో వుందలించింది. తవు ఉత్తర్వుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఉండడానికి తావుు నిస్సహాయుులం కాదని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లవద్దంటూ సుబ్రతా రాయ్‌కు జారీ చేసిన ఆదేశాలు కొనసాగుతాయుని పేర్కొంది. ‘న్యాయుస్థానం నిస్సహాయుురాలని భావించవద్దు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో మీరు చెప్పకపోతే మేం కనుగొనగలం. మీపై సీబీఐ, కంపెనీల రిజిస్ట్రార్ల దర్యాప్తునకు మేం ఆదేశించగలం. మీరు సొవుు్మను వాపసు చేశారంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న రికార్డులు మీవద్ద ఉండితీరాలి’ అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సొవుు్మ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయుం అసంగతవుని సెబీకి సహారా గ్రూప్ లేఖ రాయుడంపై కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. సుబ్రతా రాయ్‌తో పాటు కంపెనీ వ్యవహారశైలి జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో వేలాది కోట్ల రూపాయులు వుుడిపడి ఉన్నాయుని పేర్కొంటూ, రిజిస్టరైన కంపెనీలు అకౌంట్లను నిర్వహించకుండా ఎలా ఉండగలుగుతున్నాయుని ప్రశ్నించింది. గత రెండేళ్లుగా వాస్తవం చెప్పలేకపోయూరంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. మీరు తప్పు చేసి ఉంటే మేమేం చేయులేం... అని కోర్టు స్పష్టం చేసింది.