దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్‌కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్‌లో కొన్ని అంశాలను పంచుకున్నారు.
‘ఈక్విటీ మార్కెట్‌లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్‌కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్‌లకు తగిన విధంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్‌లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్‌ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్‌మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.
In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.
Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్‌ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్‌లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్‌లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్‌లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment