న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వివిధ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్ https://www.eci.gov.in/లో పొందుపరిచింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. రూ.891 విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా సంస్థ కొనుగోలు చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15 సాయంత్రంలోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైబ్‌లో అందుబాటులో ఉంచింది. న్యాయస్థానం ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే డేటాను ప్రచురించింది.
పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు; పార్ట్-2లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను ఉంచింది.
కాగా దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది.
చదవండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ తలకు తీవ్రగాయం
Comments
Please login to add a commentAdd a comment