Rajput Karni Sena
-
రగులుతున్న రాజస్థాన్.. కేంద్రం సీరియస్
జైపూర్: రాజ్‌పుత్‌ల ఆందోళనలతో రాజస్థాన్ అట్టుడికిపోతోంది. కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్యతో రగిలిపోతున్న రాజ్‌పుత్ సంస్థలు రోడ్డెక్కాయి. రవాణా స్తంభించిపోగా.. దుకాణాలు మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బంద్ వంకతో నిరసనకారులు రోడ్డెక్కి ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారు. దీంతో ఈ పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాజస్థాన్ ఆందోళనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించింది కేంద్ర హోంశాఖ. దీంతో కేంద్ర బలగాలు రాజస్థాన్ పోలీసులతో కలిసి కవ్వింపు చర్యలకు దిగుతున్నవాళ్లను చెదరగొట్టనున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల విజయంతో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో బిజీగా ఉన్న బీజేపీకి.. ఈ పరిణామాలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. लाठी डंडे लेकर पेट्रोल पंप पर धावा बोलने वाली गुंडों की फौज,उपद्रव करने के लिए, क्या सरकार बदलने का ही इंतज़ार कर रही थी ?#Rajasthan pic.twitter.com/ktNUH5O8JJ — Ruby Arun रूबी अरुण روبی آرون 🇮🇳 (@arunruby08) December 6, 2023 जयपुर - दिल्ली हाईवे....#सुखदेव_सिंह_गोगामेड़ी_हत्याकांड#SukhdevSinghGogaMedi pic.twitter.com/gIJFESZnqg — Kaushal Singh Sudharanpara (@KS_Sudharanpara) December 6, 2023 ఆస్పత్రికి భారీగా.. కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యొదంతం రాజస్థాన్‌ను కుదిపేసింది. ఈ హత్యకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ రాజ్‌పుత్ కర్ణిసేన, ఇతర కమ్యూనిటీలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అయితే ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగలేదు. రోడ్లపై టైర్లు తగలబెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు పలు చోట్ల లాఠీలకు పని చెప్పారు. राजस्थान: उदयपुर में जिला कलेक्ट्रेट के बाहर इकट्ठा हुए करणी सेना के कार्यकर्ता ◆ सुखदेव सिंह गोगामेड़ी की हत्या पर विरोध प्रदर्शन जारी #SukhdevSinghGogaMedi #Rajasthan #KarniSena pic.twitter.com/dHKCwegxjg — News24 (@news24tvchannel) December 6, 2023 మరోవైపు సుఖ్‌దేవ్ మృతదేహం ఇంకా జైపూర్ ఆస్పత్రిలోనే ఉంది. దీంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో రాజ్‌పుత్‌లు వస్తుండడంతో అక్కడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యపై రాజ్‌పుత్ కర్ణి సేన న్యాయ విచారణకు(జ్యూడీషియల్ ఎంక్వైరీ) డిమాండ్ చేస్తోంది. కానీ, రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఈ కేసు అప్పగించారు. ఇదీ చదవండి: గోగామేడి హంతకులు వీళ్లేనా?.. ఫొటోలు రిలీజ్ -
‘ఆ వార్తలకు.. మాకు సంబంధం లేదు’
మణికర్ణిక చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వస్తున్న వార్తలకు, తమకు సంబంధం లేదంటున్నారు రాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు. ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కర్ణిసేన సభ్యులు స్పందించారు. మనికర్ణిక సినిమాను తాము అడ్డుకోబోవడం లేదని స్పష్టం చేశారు కర్ణిసేన సభ్యుడు హిమాన్షు. ఈ సినిమా పట్ల తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. కర్ణిసేన పేరును కొందరు స్వంత ప్రయోజనాలకు వాడుతున్నారన్నారు. ఇలాంటి పనికి మాలిన చర్యల ద్వారా.. కర్ణిసేన పేరును, దాని చరిత్రను చెడగొడుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కర్ణిసేన అభ్యంతరాల పట్ల కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజ్పుత్నేనంటూ.. అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దంటూ హెచ్చరించారు. అయితే గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన పద్మావత్‌ను కూడా కర్ణిసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన పద్మావత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
నేనూ రాజ్‌పుత్‌నే..
సాక్షి, ముంబై : ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికను వివాదాలు వెంటాడుతున్నాయి. మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌కు ఓ బ్రిటిష్ అధికారితో సంబంధం ఉన్నట్టు చూపే సన్నివేశంతో పాటు ఆమె నృత్యం చేసే సన్నివేశం పట్ల కర్ణిసేన ఆక్షేపిస్తోంది. కాగా, ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించడంతో పాటు కొద్ది భాగానికి దర్శకత్వ బాధ్యతలూ చేపట్టిన కంగనా రనౌత్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మణికర్ణికపై వరుస వివాదాలు ముసురుకోవడం పట్ల ఆమె భగ్గుమన్నారు. ఈ సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి ధ్రువీకరించారని, తాము సెన్సార్ సర్టిఫికెట్‌ను కూడా పొందామని కంగనా చెప్పుకొచ్చారు.ఈ దశలో సినిమాపై కర్ణిసేన అభ్యంతరంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణిసేనకు పరిస్థితిని తాము వివరించినా వారు తనను వేధించడం కొనసాగిస్తున్నారని, దీన్ని వారు విరమించకపోతే తానూ రాజ్‌పుత్‌నే అన్న విషయం వారు గుర్తెరగాలని, వారెవరినీ తాను విడిచిపెట్టనని హెచ్చరించారు. మణికర్ణిక మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కర్ణిసేన యూటర్న్.. ‘పద్మావత్ ఓ అద్భుతం’
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రంపై శ్రీరాజ్‌పుత్ కర్ణి సేన ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ చిత్రంపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పద్మావత్ అమోఘం అంటూ విపరీతమైన పొగడ్తలు గుప్పించింది. శుక్రవారం ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్ యోగంద్ర సింగ్ కటార్ మీడియాతో మాట్లాడారు. ‘‘చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు’’ అంటూ కటార్ తెలియజేశారు. ఇక కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామడి ఆదేశాలను అనుసరించి కర్ణిసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘సినిమాలో రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కూడా లేవు. రాజ్‌పుత్‌ల మనోభావాలు చిత్రం దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా చిత్రం ఆడేందుకు దోహదం చేస్తాం’’ అని పేర్కొంది. కాగా, చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించింది. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు సినిమాలో అలాంటి అంశాలేవీ లేవని నిర్ధారణ కావటంతో యూటర్న్ తీసుకుని మద్ధతు ప్రకటించింది. -
భన్సాలీ గర్వపడే సినిమా తీస్తాం : కర్ణిసేన
జైపూర్ : ఎట్టకేలకు పద్మావత్ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కర్ణి సేన ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. దీనికి తోడు చిత్ర యూనిట్ సభ్యులకు తాజాగా మళ్లీ బెదిరింపులు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లి ‘లీలా భన్సాలీ’పై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్ సింగ్ కంగరౌత్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘భన్సాలీ తల్లిపై చిత్రం రాబోతుంది. అరవింద్ వ్యాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. చిత్రం టైటిల్ పేరు ‘‘లీలా కి లీలా’’ . భన్సాలీ పద్మావత్ తో మా తల్లి రాణి పద్మావతిని అవమానించారు. కానీ, మేం తీయబోయే చిత్రాన్ని తీయబోయే చిత్రం చూసి భన్సాలీ ఖచ్ఛితంగా గర్వపడతారు’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభకాబోతుందని గోవింద్ వెల్లడించారు. ‘దేశంలో ప్రతీ పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న పాయింట్‌తో పద్మావత్‌ను భన్సాలీ తెరెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉపయోగించుకునే ఇప్పుడు మేం అంతకంటే భేషుగ్గా.. పచ్చి నిజాలను చూపిస్తాం’ అని కర్ణిసేన ప్రకటించింది. ఇదిలా ఉంటే గురుగావ్ దాడుల వెనుక భన్సాలీ ప్రమేయం ఉన్నట్లు కర్ణిసేన సంచలన ఆరోపణలకు దిగింది. -
శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఎవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఐదారు రాష్ట్రాల్లో కర్ణిసేన అల్లర్లు సష్టిస్తున్న నేపథ్యంలో ఈ సేన ఎప్పుడు పుట్టింది ? ఎందుకు పుట్టింది ? దీనికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు ? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు రావడం సహజమే. రాజస్థాన్ రాజ్‌పుత్ సామాజిక వర్గానినికి చెందిన నిరుద్యోగ యువత 2006 సంవత్సరంలో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’ను ఏర్పాటు చేసింది. అప్పటికే రాజ్‌పుత్ నాయకుడిగా ఆ కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న లోకేంద్ర సింగ్ కల్వీ అండదండలతో అది ప్రాణం పోసుకుంది. కులాల ప్రాతిపదికన తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసింది. కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లను రాజ్‌పుత్ రాజకీయ నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా, శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాడ్డాక హఠాత్తుగా వారి వైఖరి మారింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా వారి వైఖరి అదే. ఆ తర్వాత తమ నాయకుల రాజకీయ సమీకరణల కారణంగా ఈ సేనలో చీలికలు వచ్చి మూడు గ్రూపులుగా సేన విడిపోయింది. తొలిగ్రూపు శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన కాగా, రెండో గ్రూపు రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనా సమితి, మూడో గ్రూపు శ్రీరాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన. శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనను లోకేంద్ర సింగ్ కల్వీ ఏర్పాటు చేసినప్పుడు సేనకు అధ్యక్షుడిగా అజీత్ సింగ్ మందోలిని నియమించారు. 2008లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినప్పుడు తనకు కాంగ్రెస్ టిక్కెట్ కావాలని మందోలి పట్టుపడ్డారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కల్వీ టిక్కెట్‌ను ఆశిస్తున్నందున ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో మొదటిసారిగా కర్ణిసేన విడిపోయింది. ఆ తర్వాత 2010లో మూడో వర్గం ఏర్పడింది. రెండు లక్షల మంది సభ్యులున్నారని చెప్పుకుంటున్న ఆవిర్భావ సంస్థ ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’నే ప్రస్తుతానికి బలమైన గ్రూపు. ఉమ్మడి లక్ష్యాల కోసం ఏ ఆందోళనలు చేసినా ఈ మూడు గ్రుపులు పోటాపోటీగా వ్యవహరిస్తాయి. ఆందోళనల సందర్భంగా విధ్వంసానికి దిగడంలో కర్ణిసేనలకు పెట్టింది పేరు. అశుతోశ్ గోవరికర్ తీసిన ‘జోధా అక్బర్’ బాలీవుడ్ సినిమాను 2006లో అడ్డుకోవడం ద్వారా కర్ణిసేన పేరు మొదటిసారి దేశవ్యాప్తంగా వినిపించింది. ఇప్పుడు పద్మావత్ సినిమాను అడ్డుకోవడం ద్వారా ఆ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెల్సింది. -
‘మీ పకోడా రాజకీయాలు మా పైనేనా?’
సాక్షి, హైదరాబాద్ : పద్మావత్ చిత్ర విడుదల నేపథ్యంలో కర్ణిసేన చేపట్టిన ఆందోళనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నిరసనకారులు ఇంత చేస్తున్నా ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గురువారం ఉదయం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఒవైసీ... ‘‘బీజేపీ పకోడా రాజకీయాలు చేస్తుందని స్పష్టంగా అర్థమౌతోంది. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ నిరసనకారుల ముందు మోకరిల్లాయి. 56 ఇంచులంటూ మోదీ ముస్లింలపైనే రొమ్ము విరుస్తారే తప్ప.. వారిని(కర్ణిసేన) అదుపు చేయలేకపోతున్నారు. సిగ్గుచేటు’’ అని తెలిపారు. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా వారిని ఎందుకు నిలువరించలేకపోతున్నారని ప్రశ్నించిన ఒవైసీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారని చెప్పారు. కాగా, గతంలో పద్మావత్ చిత్ర వివాదంపై స్పందించిన ఒవైసీ అది ఓ బక్వాస్(పనికిమాలిన)చిత్రం అని పేర్కొన్న విషయం తెలిసిందే. దయచేసి ఆ చిత్రం చూడకండి అంటూ ముస్లిం ప్రజానీకానికి ఆయన పిలుపు కూడా ఇచ్చారు. -
పప్పులో కాలేసిన కర్ణిసేన
భోపాల్ : రాజ్‌పుత్ కర్ణిసేన పప్పులో కాలేసింది. పద్మావత్‌కు నిరసనగా చేపట్టిన ఆందోళనలో అతి చూపించటంతో సొంత కార్యకర్తే నష్టపోయాడు. అంతా కలిసి అతని కారును తగలబెట్టేశారు. బుధవారం సాయంత్రం భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యోతి టాకీస్ వద్ద సాయంత్రం గుమిగూడిన కర్ణిసేన ఒక్కసారిగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. కనిపించిన షాపులను, వాహనాలను పగలగొడుతూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ‘ఎంపీ 04 హెచ్‌సీ 9653’ స్విఫ్ట్ కారును వారు తగలబెట్టారు. అది గమనించిన కారు యాజమాని లబోదిమంటూ పరిగెత్తుకొచ్చాడు. కారు యాజమానిని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివసించే సురేంద్ర సింగ్ గా గుర్తించారు. కర్ణిసేన కార్యకర్త అయిన అతను తన కారును పక్కనే నిలిపి నిరసనకారులతో కలిసి పక్క వీధిలో ఆందోళన చేపట్టాడంట. ఇంతలో ఎవరో కారు తగలబడుతోందని సురేంద్రకు చెప్పటంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడంట. కానీ, అప్పటికే కారు సగంకి పైగా కాలిపోయిందని సురేందర్ చెబుతున్నాడు. స్టిక్కర్‌ను కూడా గమనించకుండా కర్ణిసేన కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లు అతను వాపోయాడు. పోలీసులకు అతను ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అట్టుడుకుతున్న భోపాల్... మొదటి నుంచి పద్మావత్ విడుదలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బ్యాన్ కోసం తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు రాజ్‌పుత్ కర్ణిసేన మాత్రం పద్మావత్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఆడనివ్వబోమని ప్రకటించి భోపాల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఎంపీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అల్లర్లకు పాల్పడుతున్న 12 మంది కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కీలక నేతలు స్టేషన్‌ను ముట్టడించటంతో పోలీసులు వారిని విడిచిపెట్టాల్సి వచ్చింది. నేడు చిత్రం విడుదల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
పద్మావత్ ఎఫెక్ట్ .. మొదలైన విధ్వంసకాండ
గాంధీనగర్ : రాజ్‌పుత్ కర్ణిసేన అన్నంత పని చేయటం ప్రారంభించింది. గుజరాత్లో పద్మావత్ చిత్రం ప్రదర్శితం కాబోయే ఓ థియేటర్‌ను ధ్వంసం చేసేసింది. శనివారం అర్ధరాత్రి అహ్మదాబాద్‌లోని రాజ్‌హంస్ సినిమాస్ కాంప్లెక్స్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కర్ణిసేనకు సంబంధించిన కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా థియేటర్ కాంప్లెక్స్‌లోకి దూసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేయటంతోపాటు బయట ఉన్న కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డు వచ్చిన సిబ్బందిని కూడా వారు చితకబాదారు. ఈ ఘటనపై యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నాడు. మరికొన్నిచోట్ల థియేటర్ల ముందు హెచ్చరికల బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల మీద కూడా దాడులు చేస్తామని అందులో రాసి ఉంది. కాగా, పద్మావత్ ప్రదర్శించించే థియేటర్లను తగలబెడతామని కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా దాడి నేపథ్యంలో గుజరాత్‌తోపాటు రాజస్థాన్‌లోనూ థియేటర్ల యాజమానులు పద్మావత్ రిలీజ్ విషయంలో పునరాలోచనలో చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. Gujarat: Protesters vandalised Rajhans Cinemas in Ahmedabad late last night #Padmaavat pic.twitter.com/bGhCu7TNNh — ANI (@ANI) 21 January 2018 కర్ణిసేనకు భన్సాలీ ఆహ్వానం... పద్మావత్ చిత్రాన్ని వీక్షించేందుకు శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేనకు దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఆహ్వానం పంపారు. కాగా, ఆ లేఖను కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి సింగ్ తగలబెట్టేశారు. పక్కా కుట్ర తోనే ఈ వ్యవహారమంతా సాగుతోందని, చిత్రాన్ని అడ్డుకునేందుకు చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. భన్సాలీ ప్రజెంట్స్.. జోకులు... పద్మావత్ చిత్రంపై వివాదం కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియాలో మాత్రం కొందరు తమదైన శైలిలో ఛలోక్తులు విసురుతున్నారు. ముఖ్యంగా భన్సాలీ పేరిట చిత్ర ప్రారంభంలో వేసే విజ్ఞప్తులు(Disclaimers) పేరిట కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. సినిమా చూస్తున్న సమయంలో ఒకవేళ కర్ణిసేన దాడి చేస్తే.. టికెట్ డబ్బులు వాపసు చెయ్యం. మీ ప్రాణాలకు మీరే బాధ్యులు. ఒకవేళ కర్ణిసేన దాడి చేస్తే.. ఎడమ వైపు ద్వారం ద్వారా బయటకు పరిగెత్తండి. ఎందుకంటే కాస్త దూరంలోనే ఆస్పత్రి ఉంది కాబట్టి... కర్ణిసేన దాడి చెయ్యటంతో మీకు బాగా కోపం వచ్చిందా? అయితే కుడివైపు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ డొనేషన్ బాక్స్ ని వాడుకోండి. అది మిమల్ని చల్లబరుస్తుంది. ఇలాంటి సెటైర్లు పేలుతున్నాయి. Padmavati will begin with these initial disclaimers and credits.#Padmaavat #Padmavat pic.twitter.com/Q8GmFbgO96 — THE SKIN DOCTOR (@theskindoctor13) 19 January 2018 -
హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రం విడుదలైతే థియేటర్లను తగలబెడతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశంలో స్వేచ్ఛా హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. సినిమాను అడ్డుకుంటామని.. థియేటర్లు ధ్వంసం చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ చిత్ర యూనిట్ సభ్యులు కోరితే... వారికి కూడా వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు. కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిత్రంపై నిషేధం విధించగా.. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. చిత్ర విడుదలను అడ్డుకోవద్దంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తెలిసిందే. బండిట్ క్వీన్ చిత్ర విషయంలోనే అభ్యంతరం వ్యక్తం కానప్పుడు.. పద్మావత్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చిత్రం విడుదలైతే రాజ్‌పుత్ మహిళలంతా సాముహిక ఆత్మహత్యలకు పాల్పడతారని కర్ణిసేన హెచ్చరిస్తోంది. అనధికార నిషేధం...? కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో... సుప్రీం కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారిక బ్యాన్ విధించే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల సంగతి పక్కన పెట్టి.. స్థానిక చట్టాల చొరవతో రాష్ట్రాలు నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కర్ణిసేన అధినేత లోకేంద్ర సింగ్ కల్వి కోరుతున్నారు. గతంలో రాజస్థాన్ లో జోధా అక్బర్ చిత్రాన్ని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా బహిష్కరించిన విషయాన్ని, మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫనా చిత్రాన్ని గుజరాత్లో నిషేధించిన(అనధికారికంగా) విషయాన్ని లోకేంద్ర గుర్తు చేస్తున్నారు. -
గుజరాత్‌లోనూ పద్మావత్‌కు చుక్కెదురు
సాక్షి, ముంబయి : వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావత్‌కు సెన్సార్ క్లియరెన్స్ లభించినా చిక్కులు తప్పడం లేదు. సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేసేందుకు అనుమతించమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పగా తాజాగా గుజరాత్ సైతం పద్మావత్ మూవీని బ్యాన్ చేసింది. పద్మావత్ సినిమా తమ రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల కాదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శుక్రవారం ప్రకటించారు. జనవరి 25న పద్మావత్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పద్మావత్‌లో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్ కర్ణి సేన ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పద్మావత్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సీబీఎఫ్సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రాజ్పుట్ కర్ణి సేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఏకమవుతున్న రాజ్‌పుత్‌లు.. పూర్తిగా బ్యాన్!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్నెర్ర చేసింది. సెన్సార్ బోర్డు ప్యానెల్ కమిటీ సూచనలు.. అందుకు మేకర్లు కూడా దాదాపు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు. చిత్రాన్ని పూర్తిగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై దేశంలోని రాజ్‌పుత్ తెగకు చెందిన వారంతా జనవరి 27న చిత్తోర్‌ఘడ్‌లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆ భేటీలో చిత్ర విడుదలను అడ్డుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘రాణి పద్మావతి త్యాగం వెలకట్టలేనిది.. అలాంటి వ్యక్తిని అభాసుపాలు చేసేలా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకుంటామా?. సినిమా విషయంలో భన్సాలీకే స్పష్టత కొరవడినట్లుంది. ఓసారి చరిత్ర అంటాడు.. మరోసారి కల్పితం అంటాడు. సెన్సార్ బోర్డు నిర్ణయం కూడా సముచితంగా లేదు. ఆరు నూరైనా చిత్రాన్ని అడ్డుకుని తీరతాం. ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని ఆయన హెచ్చరించారు. చరిత్రను భ్రష్టు పట్టిస్తుంటే నేతలు చూస్తూ ఊరుకోవటం సరికాదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని లోకేంద్ర స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్ 30న సెన్సార్ బోర్డు పద్మావతి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. టైటిల్‌ను పద్మావత్‌గా మార్చటంతోపాటు పలు సూచనలు పాటిస్తే యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్ర విడుదలకు లైన్ క్లియర్ చేస్తామని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా అంగీకరించారని.. ఫిబ్రవరి 9న చిత్రం విడుదల కాబోతుందని ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. -
పద్మావతి... ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటి?
సాక్షి, సినిమా : బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛారిటీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటని అన్నారు. ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తనలాంటి వాళ్లు తప్పుకుండా చూస్తారు కాబట్టేనంట. ‘‘నిజంగా ఇది నవ్వుతో పాటు చిరాకు తెప్పించే పరిణామం. ఒక దర్శకుడుపై దాడి చేయడం మొదటి సారి చూస్తున్నా. ఒక సినిమాను చూడకముందే..వాళ్లు అలా ప్రవర్తించడం ఏమిటి. అసలు వాళ్లకి నిజమైన పద్మావతి కథ తెలుసా ? అనేది నా అనుమానం. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అనుకోని విధంగా వారు ఇష్టం వచ్చినట్లు ఉహించుకుంటున్నారు. ఆ విధమైన ఆలోచనతో ఎలా వివాదాలను సృష్టిస్తున్నారో’’ అని అనురాగ్ వివరించారు. కాగా, బాలీవుడ్ లో ఈ ఇయర్ బిగెస్ట్ రిలీజ్ గా భావించిన పద్మావతి రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరాలు, సెన్సార్ సమస్యలతో ఇంకా రిలీజ్ నోచుకోని విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నా.. స్పష్టత లేకుండా పోయింది. -
మరో వివాదంలో పద్మావతి
జైపూర్: పద్మావతి వివాదం మరో మలుపు తీసుకుంది. శుక్రవారం జైపూర్‌లోని ఒక కోటకు వేలాడుతూ కనిపించిన వ్యక్తి మృతదేహం పద్మావతి సినిమాపై తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నహర్‌గఢ్ కోట ప్రహారీ గోడకు వేలాడుతున్న చేతన్ కుమార్ సైనీ(40) మృతదేహం పక్కన పద్మావతి సినిమా వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తూ కొన్ని రాతలు దర్శనమిచ్చాయి. తమను బెదిరించడానికే ఆ రాతలు రాశారని రాజ్‌పుత్ కర్ణిసేన ఆరోపించగా, పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు చెప్పడం గమనార్హం. సైనీది హత్యా? లేక ఆత్మహత్యా?.. పద్మావతి సినిమాతో ఈ మరణానికి ఏమైనా సంబంధముందా? అన్న అంశాలపై మాత్రం సందిగ్ధం వీడలేదు. ఈ సంఘటనపై జైపూర్ నార్త్ డీసీపీ సత్యేంద్ర సింగ్ సందిస్తూ.. ‘చేతన్ కుమార్ జైపూర్‌లోని శాస్త్రీ నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు. కోట సరిహద్దు గోడకు అతని మృతదేహం వేలాడుతోండగా గుర్తించాం. పక్కన రాళ్లపై కొన్ని రాతలు కనిపించాయి. ఈ సంఘటనకు పద్మావతి ఆందోళనలకు మధ్య సంబంధంపై ఇప్పుడే అంచనాకు రావడం సరికాదు’ అని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. మృతదేహం సమీపంలోని రాళ్లపై ‘ మేం కేవలం దిష్టిబొమ్మల్ని మాత్రమే వేలాడదీయమని పద్మావతి వ్యతిరేకులు తెలుసుకోవాలి. మేం బలవంతులం’ అని రాసి ఉంది. అయితే సైనీ మృతికి, పద్మావతి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు రామ్ రతన్ సైనీ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని, ఈ మరణంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా రాజ్‌పుత్ కర్ణి సేన దీనిపై స్పందిస్తూ... నిరసన తెలిపే విధానం ఇది కాదని, తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఆ సంస్థ అధ్యక్షుడు మహిపాల్‌సింగ్ మాట్లాడుతూ ‘మా సంస్థను బెదిరించేందుకే రాళ్లపై ఆ రాతలు రాశారు’ అని చెప్పారు. పద్మావతిపై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు పద్మావతి సినిమాపై పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పద్మావతిలో చరిత్రను వక్రీకరించారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సినిమా విడుదలకు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ‘మీరు సినిమా చూశారా.. సినిమా హాళ్లను తగులబెడుతున్నవారు సినిమా చూశారా? ఆందోళన చేస్తున్నవారిని మరింత ప్రోత్సహించేలా ఈ పిటిషన్లు ఉంటున్నాయి’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
'పద్మావతి'కి రెబల్ స్టార్ మద్దతు
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఐదు రోజులకు బెళగావిలోని సువర్ణసౌధకు వచ్చిన రెబల్ స్టార్ అంబరీష్ బాలీవుడ్ సినిమా పద్మావతికి మద్దతు ప్రకటించారు. సువర్ణసౌధ వద్ద విలేకరులతో మాట్లాడుతూ...పద్మావతి చిత్రాన్ని విడుదల చేయడంలో ఎలాంటి తప్పు లేదు. పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకొణేలను కొందరు బెదిరించడం ఎంత మాత్రం సరికాదని పేర్కొన్నారు. భారీ బడ్జెట్ తో చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కిన పద్మావతి సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే పలు సంఘాల నుంచి విమర్శలు వస్తుండటంతో పాటు సెన్సార్ కార్యక్రమాలు కూడ ఆపూర్తి కాకపోవటంతో సినిమా వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ లేకపోయినా.. రోజుకో వివాదంతో పద్మావతి వార్తల్లో వినబడుతూనే ఉంది. -
పద్మావతిలో దావూద్ డబ్బులు!
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రంపై మరోసారి రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీం భాగస్వామిగా ఉన్నాడంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో గత రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన దీపికపై కూడా మండిపడ్డారు. ఈ చిత్రంలో ముంబై మారణహోమం ప్రధాన సూత్రధారి దావూద్ హస్తం కూడా ఉంది. అతను దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తే.. వాటితో భన్సాలీ పద్మావతిని తీశాడు. కరాచీ నుంచి నాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అని కల్వి తెలిపారు. ఇక చిత్రం విడుదలైన తీరుతుందంటూ దీపిక పడుకొనే తనకు సవాల్ విసరటంపై ఆయన ధ్వజమెత్తారు. చిత్రాన్ని పద్రర్శించకుండా ఆటలాడుతున్నారని.. ఇంతలో సెన్సార్ గొడవ... చిత్ర విడుదల వాయిదా అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో సినిమా థియేటర్లకు రాబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దీపికను తగలబెడితే కోటి పద్మావతి చిత్రంపై మరో నజరానాను ప్రకటించారు. ఈ చిత్ర హీరోయిన్ దీపికను సజీవంగా తగలబెట్టినవారికి కోటి రూపాయల నజరానా ఇస్తామని అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం యువ నేత భువనేశ్వర్ సింగ్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పద్మావతి మహారాణి చేసిన త్యాగం గురించి అర్థం చేసుకునేంత తెలివి దీపికకు లేదు. అందుకే అలాంటి వాళ్లు బతకటానికి వీల్లేదు అంటూ భువనేశ్వర్ తెలిపారు. ఇంతకు ముందు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో ఆర్డినేటర్ సూరజ్ పాల్ అము.. భన్సాలీ, దీపిక తలలపై 10 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. -
'పద్మావతి’పై నిరసనలు తీవ్రతరం
జైపూర్: బాలీవుడ్ చిత్రం పద్మావతిపై నిరసనలు రాజస్తాన్‌లో ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. రాజ్‌సమంద్ జిల్లాలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూ శనివారం చారిత్రక కుంభల్గఢ్ కోటలోకి ప్రవేశాన్ని అడ్డగించారు. కోటలో జరిగిన ప్రదర్శన కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిష్టి బొమ్మను ఉరితీశారు. సెన్సార్ సర్టిఫికేట్ పొందకుండానే ఈ చిత్రాన్ని కొందరు పాత్రికేయుల ముందు ప్రదర్శించడాన్ని సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి తప్పుపట్టారు. ‘ ఇలాంటి చర్యలు సీబీఎఫ్సీ పాత్రను బలహీనపరిచేలా ఉన్నాయి. తమ సౌకర్యం కోసం సర్టిఫికేషన్ ప్రక్రియను ఇలా హ్రస్వ దృష్టితో చూడటం సరికాదు’ అని జోషి వ్యాఖ్యానించారు. సీబీఎఫ్సీ సర్టిఫికేట్ కోసం నిర్మాతలు చేసుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నందునే దాన్ని వెనక్కి పంపామని వెల్లడించారు. ఈ చిత్రం కల్పితమా లేక చరిత్ర ఆధారితమా అన్న విషయాన్ని డిస్‌క్లేమర్‌లో చెప్పకుండా ఖాళీగా వదిలేశారని తెలిపారు. సర్టిఫికెట్ ఇవ్వకుండానే దరఖాస్తును సీబీఎఫ్సీ వెనక్కి పంపడం ఓ రాజకీయ స్టంట్ అని, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రదారు దీపికా పదుకొనేకు హాలీవుడ్ నటి రూబీ రోజ్ బాసటగా నిలిచారు. తనకు తెలిసిన ధైర్యవంత మహిళల్లో దీపికా ఒకరని ట్వీట్ చేశారు. దీపికకు వచ్చిన బెదిరింపులకు నిరసనగా గోవాలో జరనగనున్న ఇఫ్ఫి వేడుకలను సినీ పరిశ్రమ బహిష్కరించాలని ప్రముఖ నటి షబానా అజ్మీ అన్నారు. -
'పద్మావతి రిలీజ్ రోజున భారత్ బంద్'
బాలీవుడ్ సినిమా పద్మావతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమాను విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం అంటూ రాజ్ పుత్ కర్ణిసేన ప్రకటిస్తుంటే, మా సినిమాను ఎవరూ అడ్డుకోలేరంటూ చిత్రయూనిట్ సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. సెన్సార్ బోర్డ్ కూడా సినిమాను సర్టిఫై చేసే విషయంలో ఆలస్యం చేస్తోంది. రివ్యూకు పంపిన ప్రింట్ లో సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పిటీషన్ ను వెనక్కి పంపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్, ప్రచార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. కానీ ఇంత వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 1న కాకుండా సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వీ పద్మావతి సినిమా రిలీజ్ రోజైన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. -
దీపిక ఏమైనా తోపు అనుకుంటుందా?
పట్న(బిహర్) : పద్మావతి చిత్ర వివాదం పూటపూటకి వేడిని మరింతగా రాజేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్‌పై దీపిక పడుకొనేపై రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మండిపడ్డారు. పట్నలో మీడియాతో మాట్లాడిన ఆయన దీపిక తాజాగా చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ‘‘రాణి పద్మావతిని అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేయసిగా చూపించటాన్ని ఎవరు భరిస్తారు? చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదలై తీరుతుందని దీపిక చెబుతోంది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయే తప్ప.. ఆలోచనా ధోరణితో లేవు. ఆమె ఏం ఈ దేశానికి అధినేత కాదు. ఆదేశాలు చేయటానికి ఏమైనా తోపు అనుకుంటుందా?. రాజ్‌పుత్ కర్ణి సేన అధినేతగా చెబుతున్నా ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాబోదు’’ అని లోకేంద్ర పేర్కొన్నారు. రాణి పద్మావతి తమకు తల్లి లాంటిదని... అలాంటి మహనీయురాలి పేరును చెడగొట్టేందుకు దర్శకుడు భన్సాలీ ప్రయత్నిస్తున్నాడని లోకేంద్ర తెలిపారు. ఆ ఘోరాన్ని తాము భరించలేమని ఆయన అంటున్నారు. ఒక్క రాజ్‌పుత్ మాత్రమే కాదు.. ఈ సినిమాను అడ్డుకునేందుకు యావత్ భారత సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేంద్ర సింగ్ ప్రస్తావించారు. కాగా, సినిమా విషయంలో జోక్యం చేసుకోవటానికి రాజ్‌పుత్ కర్ణి సేన ఎవరని? అందుకు సెన్సార్ బోర్డు ఉందని దీపిక వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం చెందిన సేన సభ్యుడొకరు ఆమె ముక్కును కోసేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. -
‘పద్మావతి..థియేటర్ల ఆహుతి’
సాక్షి,ముంబయి: బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిని వివాదాలు వీడలేదు. గతంలో రెండు సందర్భాల్లో మూవీ సెట్లను దగ్ధం చేయడం, దర్శకుడిపై రాజ్‌పుత్ కర్ని సేన కార్యకర్తలు దాడులకు తెగబడటం తెలిసిందే. తాజాగా రాణి పద్మిని ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను ముందుగా తమకు ప్రదర్శించిన తర్వాతే విడుదల చేయాలని జై రాజ్పుట్ సంఘ్ అల్టిమేటం జారీ చేసింది. తమకు సినిమాను చూపించకుండా రిలీజ్ చేస్తే థియేటర్లను ధగ్థం చేస్తామని హెచ్చరించింది. మూవీలో చరిత్రను వక్రీకరించారా అనే కోణంలో తాము పరిశీలించిన తర్వాతే విడుదలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. చరిత్రను వక్రీకరించడం లేదా రాణీ పద్మావతి, అల్లాద్దీన్ ఖిల్జీ మధ్య రొమాంటిక్ అనుబంధం చూపినా తాము సహించమని హెచ్చరించింది. ఇలాంటి సన్నివేశాలుంటే సినిమా ప్రదర్శించే థియేటర్లను దగ్ధం చేసేందుకు వెనుకాడమని పేర్కొంది. పద్మావతిని అగౌరవపరిచేలా చూపి రాజస్థానీలను అవమానిస్తే చూస్తూ ఉండబోమని జై రాజపుట్ సంఘ్ వ్యవస్థాపకులు భన్వర్ సింగ్ రెటా హెచ్చరించినట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. పద్మావతి మూవీని రాజ్పుట్ సంఘాల ప్రతినిధులకు చూపాలని, రాణీ పద్మావతిని అవమానించేలా ఎలాంటి సన్నివేశాలు లేకుంటే చిత్ర విడుదలకు తాము గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 1న పద్మావతి మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇంటిపేరు పీకేసి.. నిరసన తెలిపిన హీరో!
ముంబై: ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజ్‌పుత్ కర్ణిసేన దాడి చేయడంపై బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మేవార్ రాణి పద్మావతి విషయంలో చరిత్రను వక్రీకరిస్తూ.. ఆయన 'పద్మావతి' సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ కర్ణిసేన ఆయనపై, చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ అంతా భన్సాలీకి మద్దతుగా నిలిచింది. దాడిని తీవ్రంగా ఖండించింది. తాజాగా భన్సాలీకి బాలీవుడ్ నటుడు, 'ధోనీ' సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మద్దతుగా నిలిచాడు. భన్సాలీపై రాజ్‌పుత్‌ల దాడిని ఖండిస్తూ ఆయన తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ట్విట్టర్లో ప్రొఫైల్ పేరులో తన కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించాడు. భన్సాలీకి సంఘీభావంగా ఆయన తన పేరులోని 'సింగ్ రాజ్‌పుత్'ను తొలగించి.. ట్విట్టర్లో సుశాంత్ అని మాత్రమే ఉంచారు. 'ఇంటిపేర్లపై మమకారం పెంచుకున్నంతకాలంతో మనం ఇలా బాధపడకతప్పదు. మీకు ధైర్యముంటే 'పద్మావతి'కి మద్దతుగా ఇంటిపేరును మాకు ఇచ్చేయండి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. -
నా సినిమాలో ఆ సీన్లు లేవు!
ఎవరి సెంటిమెంట్లను దెబ్బతీయను మేవార్ వర్గం గర్వించేలా తెరకెక్కిస్తాను స్పష్టం చేసిన భన్సాలీ తాను రూపొందిస్తున్న 'పద్మావతి' సినిమా రాజస్థాన్‌లోని మేవార్ వర్గం గర్వించేలా ఉంటుందని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను తెరకెక్కించాలని భావించడం లేదని ఆయన తెలిపారు. మేవార్ రాణి 'పద్మావతి' చరిత్ర ఆధారంగా భన్సాలీ తాజాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి అభ్యంతరకరంగా తెరకెక్కిస్తున్నారని రాజ్‌పుత్ కర్ణిసేన చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా దర్శకుడు భన్సాలీపై కర్ణిసేన కార్యకర్తలు చేయి చేసుకొని కొట్టడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భన్సాలీ.. రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లుగానీ, డ్రీమ్ సీక్వెన్స్గానీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయినా చిత్రయూనిట్ భద్రతను దృష్టిలో పెట్టుకొని షూటింగ్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, స్థానికులు ఇందుకు సహకరించి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. దాడి ఘటన నేపథ్యంలో జైపూర్ నుంచి ముంబైకి పద్మావతి చిత్ర యూనిట్ తిరుగుప్రయాణమైన సంగతి తెలిసిందే. -
‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’
-
‘పద్మావతి చరిత్రను వక్రీకరిస్తే చూస్తు ఊరుకోం’
-
పద్మావతి షూటింగ్ క్యాన్సిల్, ముంబైకి యూనిట్
దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా టీం, షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకొని ముంబైకి తిరుగుప్రయాణమయ్యారు. కొద్ది రోజులుగా జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రయూనిట్‌పై రాజ్‌పుత్ కర్నిసేన దాడికి దిగింది. పద్వావతి చరిత్రను వక్రీకరించారంటూ డైరెక్టర్‌తో పాటు యూనిట్ సభ్యులపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతాల్లో షూటింగ్‌కు ప్యాక్ అప్ చెప్పేసిన యూనిట్ తిరుగు పయనమయ్యారు. మరోవైపు పద్మావతి టీం పై జరిగిన దాడిని బాలీవుడ్ నటులు నిర్మాతలు ఖండించారు. అయితే కర్నిసేన సభ్యులు మాత్రం తమ తప్పేం లేదని చెపుతున్నారు. తమ ప్రాంతంలో షూటింగ్ చేస్తూ... తమ చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో చర్చలకు సిద్ధమన్నకర్నిసేన, దర్శకుడు చరిత్రను వక్రీకరించటం లేదని లిఖితపూర్వక హమీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జైపూర్‌లో మరికొద్ది రోజులు షూటింగ్ చేయాల్సి ఉన్నా.., దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ షూట్ క్యాన్సిల్ చేయటంతో తదుపరి షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందో అన్న ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాలో పద్మావతిగా నటించిన దీపిక శుక్రవారం జరిగిన సంఘటనతో షాక్ కు గురైంది. 'నిన్న జరిగిన సంఘటన షాక్ లోనే ఉన్నాను. ఈ సినిమాలో పద్మావతి పాత్రధారిగా నేను ఖచ్చితంగా చెప్పగలను సినిమాలో చరిత్రను ఏ మాత్రం వక్రీకరించలేదు. మా ఉద్దేశం మన చరిత్రలోని మహిళల ధైర్యసాహసాలను ప్రపంచానికి పరిచయం చేయటమే' అని ట్వీట్ చేసింది. -
‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’
జైపూర్: ‘పద్మావతి’ సినిమా షూటింగ్ సెట్స్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన కార్యకర్తల వీరంగం, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి ఘటన అటు సినీ రంగంతోపాటు ఇటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ‘పద్మావతి’ యూనిట్‌పై జరిగిన దాడిని బాలీవుడ్ నిర్మాతల సంఘం ఖండించగా, రాజ్‌పుత్ సేన మాత్రం సంజయ్ లీలాపై ఎదురుదాడిని కొనసాగించింది. ‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’అని ఆరోపించింది. రాజ్‌పుత్ కర్ణి సేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వీకుల చరిత్రను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ‘సంజయ్‌లీలాకు ఎంత దమ్ముంటే మా సొంత గడ్డమీద, మా పూర్వీకులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడు? జర్మనీలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సినిమా తీసే దమ్ముందా ఈయనకి? ‘పద్మావతి’ సినిమాలో రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్నారు. ఒక్క పద్మావతేకాదు.. ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే. గతంలో ‘జోధా అగ్బర్’లోనూ జోధాబాయి చరిత్రను తప్పుగా చూపించారు. అందుకే ఆయనకు బుద్ధిచెప్పాలనుకున్నా. చెప్పాం..’ అని లోకేంద్ర సింగ్ కల్వీ వివరించారు. భన్సాలీకి బాలీవుడ్ బాసట: పద్మావతి షూటింగ్ సెట్లో దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని చెంపదెబ్బకొట్టి, జుట్టుపట్టి ఈడ్చిన ఘటనపై బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అధ్యక్షుడు విక్రం భట్ స్పందించారు. ‘క్రియేటివ్ కళాకారుల జీవితాలు గాజు మేడల్లా తయారయ్యాయని ఆయన ఆదేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ మొత్తం సంజయ్‌లీలాకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు (షూటింగ్‌లపై దాడులు) జరగకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావడంలేదని భట్ అన్నారు. (షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి) హోం మంత్రి ఏమన్నారంటే: ‘పద్మావతి’ యూనిట్‌పై రాజ్‌పుత్ కర్ణి సేన దాడిపై రాజస్థాన్ హోం మంత్రి జి.సి.కటారియా స్పందించారు. మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రవర్తించడం గర్హనీయమని మంత్రి అన్నారు. దాడి ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉంటే, నిన్నటి దాడి అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు శనివారం ఉదయం విడుదలయ్యారు. వర్మ కామెంట్: ‘పద్మావతి’పై దాడి విషయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ భిన్నంగా స్పందించారు. నిన్నటి ఘటనతో పద్మావతి, ఖిల్జీ, రాజ్‌పుత్ కర్ణి సేనల గురించి దేశం మొత్తానికి తెలిసిందని, ఇందుకుగానూ సంజయ్ లీలా భన్సాలీకి థ్యాక్స్ చెబుతున్నానని ట్వీట్ చేశారు. -
షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి
-
షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి
జైపూర్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక సినిమా పద్మావతి షూటింగ్ సెట్స్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేసి, ఆయనపై దాడి చేశారు. రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్పుట్ కర్ణి సేన సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు భన్సాలీకి చెంపదెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని లాగారు. శుక్రవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ కోటలో ఈ ఘటన జరిగింది. పద్మావతి సినిమాలో టైటిల్ రోల్‌ను దీపికా పదుకోన్ పోషిస్తోంది. అలావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాణి పద్మిని, అలావుద్దీన్ మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారని ఆందోళనకారులు ఆరోపించారు. పద్మిని ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్‌గఢ్ కోటపై దాడిచేసిన అలావుద్దీన్కు లొంగిపోకుండా ప్రాణత్యాగం చేసిందని చెప్పారు. కోటను ఆక్రమించి, పద్మిని రాణిని సొంతం చేసుకోవాలని ఖిల్జీ ఎదురుచూస్తున్న సమయంలో పద్మిని ఇతర మహిళలతో కలసి ప్రాణత్యాగం చేసిందని చెప్పారు. భన్సాలీ చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, ఈ సినిమాలో ఖిల్జీకి, పద్మినికి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉంటే తొలగించాలని రాజ్పుట్ కర్ణి సేన డిమాండ్ చేసింది.