సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఐదు రోజులకు బెళగావిలోని సువర్ణసౌధకు వచ్చిన రెబల్ స్టార్ అంబరీష్ బాలీవుడ్ సినిమా పద్మావతికి మద్దతు ప్రకటించారు. సువర్ణసౌధ వద్ద విలేకరులతో మాట్లాడుతూ...పద్మావతి చిత్రాన్ని విడుదల చేయడంలో ఎలాంటి తప్పు లేదు. పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకొణేలను కొందరు బెదిరించడం ఎంత మాత్రం సరికాదని పేర్కొన్నారు.
భారీ బడ్జెట్ తో చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కిన పద్మావతి సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే పలు సంఘాల నుంచి విమర్శలు వస్తుండటంతో పాటు సెన్సార్ కార్యక్రమాలు కూడ ఆపూర్తి కాకపోవటంతో సినిమా వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ లేకపోయినా.. రోజుకో వివాదంతో పద్మావతి వార్తల్లో వినబడుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment