బాలీవుడ్ సినిమా పద్మావతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమాను విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం అంటూ రాజ్ పుత్ కర్ణిసేన ప్రకటిస్తుంటే, మా సినిమాను ఎవరూ అడ్డుకోలేరంటూ చిత్రయూనిట్ సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. సెన్సార్ బోర్డ్ కూడా సినిమాను సర్టిఫై చేసే విషయంలో ఆలస్యం చేస్తోంది. రివ్యూకు పంపిన ప్రింట్ లో సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పిటీషన్ ను వెనక్కి పంపినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్, ప్రచార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. కానీ ఇంత వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 1న కాకుండా సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వీ పద్మావతి సినిమా రిలీజ్ రోజైన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment