Censor Board of Film Certification
-
'పద్మావతి రిలీజ్ రోజున భారత్ బంద్'
బాలీవుడ్ సినిమా పద్మావతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమాను విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం అంటూ రాజ్ పుత్ కర్ణిసేన ప్రకటిస్తుంటే, మా సినిమాను ఎవరూ అడ్డుకోలేరంటూ చిత్రయూనిట్ సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. సెన్సార్ బోర్డ్ కూడా సినిమాను సర్టిఫై చేసే విషయంలో ఆలస్యం చేస్తోంది. రివ్యూకు పంపిన ప్రింట్ లో సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పిటీషన్ ను వెనక్కి పంపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్, ప్రచార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. కానీ ఇంత వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 1న కాకుండా సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వీ పద్మావతి సినిమా రిలీజ్ రోజైన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. -
సెన్సార్ బోర్డుకు ఆ 'సినిమా' తిప్పలు!
చెన్నై: ఓ బాలిక(13) సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు పరీక్ష పెట్టింది. కొన్ని నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన బాలికను పోలీసులు గతవారం గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక పేరెంట్స్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం కోర్టులో బాలికను పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాలిక చెప్పిన విషయాలు విని న్యాయమూర్తులు, పోలీసులు, బాలిక తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తాను తమిళ చిత్రం కళవని మూవీ చూసి ప్రభావితురాలినయ్యానని కోర్టుకు బాలిక విన్నవించింది. ఆ మూవీ ఎఫెక్ట్ వల్లనే ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు మైనర్ చెప్పింది. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతి. అయితే ఆ మూవీకి సీబీఎఫ్సీ కేవలం యూ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని చెన్నై కోర్టు తప్పుపట్టింది. 2010లో సీబీఎఫ్సీ కళవని మూవీకి యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించి సీబీఎఫ్సీ అధికారికి చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సినిమాకు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారు, యూ సర్టిఫికేట్ ఎలా డిసైడ్ చేశారు.. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎందుకు ఎంకరేజ్ చేశారని కోర్టు ప్రశ్నించింది. నిర్మాత సహా మూవీకి పనిచేసిన కీలక వ్యక్తుల నుంచి వివరణ తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు గడువిచ్చింది.