
సాక్షి, ముంబయి : వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావత్‌కు సెన్సార్ క్లియరెన్స్ లభించినా చిక్కులు తప్పడం లేదు. సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేసేందుకు అనుమతించమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పగా తాజాగా గుజరాత్ సైతం పద్మావత్ మూవీని బ్యాన్ చేసింది. పద్మావత్ సినిమా తమ రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల కాదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శుక్రవారం ప్రకటించారు. జనవరి 25న పద్మావత్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు పద్మావత్‌లో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్ కర్ణి సేన ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పద్మావత్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సీబీఎఫ్‌సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రాజ్‌పుట్ కర్ణి సేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment