గుజరాత్ కోర్టులో మోదీకి వ్యతిరేక తీర్పు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ రాసి ప్రచురించిన ఓ పుస్తకాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలుచేసిన పిటిషన్‌ను బుధవారం సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తి దవే ఈ కేసును పరిశీలిస్తూ.. ఆర్టికల్ 19ను ఉదహరించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేత జయేశ్‌షా ‘ఫేకూజీ హ్యావ్ ఢిల్లీ మా’ అనే పేరుతో మోదీపై వ్యంగ్యంగా పుస్తకం రాసి ప్రచురించారు.
2014 లోక్‌సభ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త నర్సింగ్ కోర్టులో దావా వేశారు. ఈ పుస్తకం మోదీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగేటట్లు ఉందని సోలంకీ ఆరోపించారు. మోదీ ఎన్నికై రెండేళ్లేనని, స్వల్ప వ్యవధిలో హామీలు నెరవేర్చ డం కష్టమన్నారు. ఈ వాదనలతో సంతృప్తి చెం దని న్యాయమూర్తి తమ భావాలను తెలిపే హ క్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.