మణికర్ణిక చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వస్తున్న వార్తలకు, తమకు సంబంధం లేదంటున్నారు రాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు. ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కర్ణిసేన సభ్యులు స్పందించారు.
మనికర్ణిక సినిమాను తాము అడ్డుకోబోవడం లేదని స్పష్టం చేశారు కర్ణిసేన సభ్యుడు హిమాన్షు. ఈ సినిమా పట్ల తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. కర్ణిసేన పేరును కొందరు స్వంత ప్రయోజనాలకు వాడుతున్నారన్నారు. ఇలాంటి పనికి మాలిన చర్యల ద్వారా.. కర్ణిసేన పేరును, దాని చరిత్రను చెడగొడుతున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా కర్ణిసేన అభ్యంతరాల పట్ల కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజ్‌పుత్‌నేనంటూ.. అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దంటూ హెచ్చరించారు. అయితే గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన పద్మావత్‌ను కూడా కర్ణిసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన పద్మావత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment