జైపూర్ : ఎట్టకేలకు పద్మావత్ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కర్ణి సేన ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. దీనికి తోడు చిత్ర యూనిట్ సభ్యులకు తాజాగా మళ్లీ బెదిరింపులు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లి ‘లీలా భన్సాలీ’పై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కర్ణిసేన ప్రకటించింది.
చిత్తోర్‌గఢ్ జిల్లా కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్ సింగ్ కంగరౌత్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘భన్సాలీ తల్లిపై చిత్రం రాబోతుంది. అరవింద్ వ్యాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. చిత్రం టైటిల్ పేరు ‘‘లీలా కి లీలా’’ . భన్సాలీ పద్మావత్ తో మా తల్లి రాణి పద్మావతిని అవమానించారు. కానీ, మేం తీయబోయే చిత్రాన్ని తీయబోయే చిత్రం చూసి భన్సాలీ ఖచ్ఛితంగా గర్వపడతారు’’ అని ఆయన తెలిపారు.
ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభకాబోతుందని గోవింద్ వెల్లడించారు. ‘దేశంలో ప్రతీ పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న పాయింట్‌తో పద్మావత్‌ను భన్సాలీ తెరెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉపయోగించుకునే ఇప్పుడు మేం అంతకంటే భేషుగ్గా.. పచ్చి నిజాలను చూపిస్తాం’ అని కర్ణిసేన ప్రకటించింది. ఇదిలా ఉంటే గురుగావ్ దాడుల వెనుక భన్సాలీ ప్రమేయం ఉన్నట్లు కర్ణిసేన సంచలన ఆరోపణలకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment