
ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు ప్రకటన రోజే రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తున్నాయి. తీరా షూటింగ్ అయ్యేసరికి విడుదలను వాయిదా వేస్తున్నారు. తాజాగా అలా వాయిదా పడిన చిత్రమే ‘లవ్ అండ్ వార్’.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్‌లో నటించనున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించి, 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.
(చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!)
ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. కానీ ‘లవ్ అండ్ వార్’ రిలీజ్‌ను మాత్రం వాయిదా వేశారు. 2026 మార్చి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదో పీరియాడికల్ ఫిల్మ్ అని, ముక్కోణపు ప్రేమకథగా ఉంటుందని సమాచారం. అలాగే వివాహం తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించనున్న చిత్రం కావడంతో ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment